ఇంగ్లాండ్ వర్ల్డ్ కప్ హీరో,  ఎవరు అయితే న్యూజిలాండ్ కలని కలలాగె మిగిలిపోయేలా చేసాడో అతనే న్యూజిలాండర్ అఫ్ ది ఇయర్ గా నామినేట్ అయ్యాడు. అవును, మీరు చదివేది నిజమే అది ఎవరో కాదు బెన్ స్టోక్స్.


అధికారిక షార్ట్‌లిస్ట్ ఇంకా తయారు చేయబడలేదు కాని 28 ఏళ్ల ఆల్‌రౌండర్ న్యూజిలాండర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకి ప్రధమ పోటీదారుడు అని ప్రధాన న్యాయమూర్తి కామెరాన్ బెన్నెట్ stuff.co.nz లో తెలియజేసాడు, "కొంతమంది కివీస్ కి చెందిన వారు అతనిని జాబితాలో చేర్చడానికి  స్పష్టంగా ఉన్నారు ". వివరాల్లోకి వెళితే.... స్టోక్స్ క్రైస్ట్‌చర్చ్‌లో జన్మించాడు, కాని తరువాత అతను తన కుటుంబంతో కలిసి ఇంగ్లాండ్ కి వెళ్లి అక్కడ క్రికెట్ ని ఆడటం ప్రారంభించాడు.


న్యూజిలాండ్ కెప్టెన్ మరియు ప్లేయర్ అఫ్ ది వరల్డ్ కప్ ఆటగాడు అయిన కేన్ విలియమ్సన్ ను కూడా ఈ అవార్డుకు ఎంపిక చేసారు.  బెన్నెట్ ప్రస్తావిస్తూ "బెన్ స్టోక్స్ అన్ని విధాలా ఈ అవార్డుకి అర్హుడని మరియు అతనికి ఈ అవార్డు పొందే అని లక్షణాలు ఉన్నాయి అని తెలిపాడు".

15 ఏళ్లు పైబడిన న్యూజిలాండ్ పౌరులందరూ ఈ అవార్డుకి నామినేట్ కావడానికి అర్హులు. ఫిల్మ్ మేకర్ తైకా వెయిటిటి మరియు మాజీ ఆల్ బ్లాక్స్ కెప్టెన్ రిచీ మెక్కావ్ మునుపటి అవార్డు గ్రహీతలలో ఉన్నారు. ప్రపంచ కప్‌లో స్టోక్స్ 465 పరుగులు చేశాడు మరియు ఫైనల్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు, ఇక్కడ 84 పరుగులతో టాప్ స్కోరింగ్ తో, అతను ఒక విచిత్రమైన ఆట తీరును కనబరిచాడు.

జులై 14న లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకూ కివీస్‌కే విజయావకాశాలు ఉన్నప్పటికీ, మార్టిన్ గుప్టిల్ వేసిన ఓవర్‌ త్రో స్టోక్స్ బ్యాట్ కి తగిలి బౌండరీ వైపు వెళ్లి ఆరు పరుగులు వచ్చి మ్యాచ్ డ్రా అయి సూపర్ ఓవర్ కి దారి తీసింది. ఈ  సంఘటన మ్యాచ్ ఫలితాన్నే మార్చివేసింది.

తరువాత సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ స్టోక్స్ కీలమైన బౌండరీతో ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. అనంతరం 16 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ సైతం ఆరు బంతుల్లో వికెట్ నష్టపోయి అదే 15 పరుగులు చేసింది.  దీంతో సూపర్ ఓవర్ కూడా టై అయింది. చివరకు బౌండరీలు ఆధారంగా ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: