అంతర్జాతీయ క్రికెట్ లో టెస్టులాడే పది దేశాల్లో జింబాబ్వే ఒకటి. ఆ దేశంలో క్రికెట్ క్రేజ్ కు గానీ, అభిమానులకు కానీ కొదవ లేదు. ఆ టీమ్ లో ఒకప్పుడు అలిస్టర్ క్యాంప్ బెల్, ఆండీ ఫ్లవర్, గ్రాంట్ ఫ్లవర్, హీత్ స్ట్రీక్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉండేవారు. మిగిలిన దేశాలకు గట్టిపోటీనే ఇచ్చేవారు. ఇప్పుడు ఆ దేశ క్రికెట్ భవిష్యత్ కనుమరుగయ్యేలా ఉంది.

 

 

ఐసీసీ జింబాబ్వే ను క్రికెట్ ఆడకుండా బ్యాన్ చేసింది. కారణం.. ఆ దేశ ప్రభుత్వం క్రికెట్ లో తలదూర్చడమే. ఐసీసీ రూల్స్ లో ప్రభుత్వ జోక్యం చేసుకుని బోర్డులోని సభ్యులను తొలగించడమే. స్థానిక ప్రభుత్వ ఏజెన్సీ అయిన స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్ కమిటీ అజమాయిషీ చెలాయించి ఆ దేశ క్రికెట్ భవిష్యత్ పై దెబ్బకొట్టింది. అసలే జింబాబ్వే క్రైసిస్ లో ఉంటుంది. ఆదాయం తక్కువైనా అక్కడి క్రీడాకారులు క్రికెట్ వైపు మొగ్గు చూపుతారు. మ్యాచ్ లు లేనప్పుడు వారికి ఉద్యోగాలు తప్పనిసరి అవుతాయి. 2004లో అప్పటి కెప్టెన్ హీత్ స్ట్రీక్ ను తొలగించడంతో 15 మంది ఆటగాళ్లు తాము క్రికెట్ ఆడమంటూ వైదొలిగారు. దీంతో ఐసీసీ అప్పట్లోనే జింబాబ్వేను టెస్ట్ మ్యాచ్ లు ఆడకుండా నిషేధించింది. ఆ తరువాత 2005లో ఐసీసీ నిషేధం ఎత్తివేసాక అదే ఏడాది 8 టెస్టులాడిన జింబాబ్వే మళ్లీ 2011 వరకూ టెస్టు మ్యాచ్ ఆడలేదు. ఈ ఏడాది వరల్డ్ కప్ కు కూడా అర్హత సాధించలేదు.

 

 

ఈ నిర్ణయంతో ఆ దేశానికి ఐసీసీ నుంచి నిధులేమీ అందవు. ఏ క్రికెట్ టోర్నీ కూడా ఆడేందుకు వీలుండదు. అయితే, ఐసీసీ ఇచ్చిన ఒక అవకాశం.. మరో మూడు నెలల్లో కొత్త బోర్డును నియమించుకోవాలని జింబాబ్వే క్రికెట్ బోర్డుకు సూచించడం. ప్రభుత్వ జోక్యం లేకుండా క్రికెట్ కొనసాగాలని ఐసీసీ కోరింది. ఇప్పుడైనా ఆదేశ ప్రభుత్వం క్రికెట్ లో తలదూర్చకుండా ఉంటే మరింత మంది ఆటగాళ్లు వచ్చి ఆ దేశ క్రికెట్ కు ఊపిరిలూదగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: