ధోనీ రిటైర్మెంట్ గురించి సర్వత్రా చర్చ నడుస్తుంది. కానీ ఇంత వరకు ధోనీ మాత్రం నోరు మెదపటం లేదు. ఇదిలా ఉంటే ప్రపంచ కప్ ముగియడంతో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళుతోంది. ఆదివారం వెస్టిండీస్ పర్యటనలో పాల్గొనే 15 మంది సభ్యులను బిసిసిఐ ఎంపిక చేయనుంది. ధోని ఈ 15 మంది సభ్యులలో ఒకడిగా ఉంటాడా లేదా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.


అయితే బిసిసిఐ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ధోని వెస్టిండీస్ పర్యటన నుంచి తనంతట తానుగా తప్పుకోనున్నట్టు బిసిసిఐకి ఇప్పటికే స్పష్టం చేశాడట. ఈ రెండు నెలలు ఆర్మీలో చేరి లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో సేవలు అందిస్తానని చెప్పినట్టు సమాచారం. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి కూడా ఒకరు ధృవీకరించారు. ధోనీ తప్పుకోవడంతో వన్డేలకు యువ వికెట్ కీపర్ రిషిబ్ పంత్కు దాదాపు చోటు ఖాయమైనట్టే.


ఇక టెస్ట్ మ్యాచ్ లకు గాను వృద్ధిమాన్ సాహా పేరు పరిశీలనలో ఉంది. అయితే ధోనీ ప్రపంచకప్ తర్వాత తనపై వస్తోన్న విమర్శల నేపథ్యంలో రిటైర్మెంట్ ప్రకటించవచ్చని అందరూ అనుకున్నా... అనూహ్యంగా రెండు నెలల పాటు సెలవు పెట్టి మరీ సైన్యంలో మేజర్గా సేవలందించాలనుకోవడం ఆశ్చర్యమే. ప్రస్తుతానికి తనపై వస్తోన్న విమర్శల నేపథ్యంలో మళ్లీ తనను తాను ఫ్రూవ్ చేసుకునేందుకే ధోనీ ఇలా తెలివైన ఎత్తుగడ వేశాడా ? అన్న చర్చ కూడా స్టార్ట్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: