అవును 2019 వరల్డ్ కప్ సీరీస్ మొత్తం న్యూజీలాండ్ అంత దురదృష్టకరమైన జట్టు మరొకటి ఉండదేమో.. సిరీస్ ఆద్యంతం రాణించిన ఈ జట్టు కేవలం ఓ అంపైర్ తప్పిదం వల్ల కప్పు కోల్పోయింది. వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ సమయంలో బెన్ స్టోక్స్ పరుగు తీస్తుండగా కివీస్ ఫీల్డర్ విసిరిన బంతి అతడి బ్యాట్ కు తగిలి బౌండరీ లైన్ తాకింది.


శ్రీలంక అంపైర్ కుమార ధర్మసేన ఓవర్ త్రోతో కలిపి మొత్తం 6 పరుగులు ఇచ్చేశాడు. నిబంధనల ప్రకారం ఇంగ్లాండ్ కు 5 పరుగులే రావాలి. స్టోక్స్ రెండు పరుగులు పూర్తి చేశాడని భావించిన అంపైర్ ధర్మసేన వాటికి మరో 4 పరుగులు కలిపి 6 పరుగులు ఇచ్చేశాడు.


ఈ మ్యాచ్ లో కేవలం ఆ ఒక్క పరుగు కారణంగా టై అయ్యింది. సూపర్ ఓవర్ లో కూడా స్కోర్లు సమానం అయ్యాయి. ఫోర్ల ఆధారంగా ఇంగ్లండ్ ను విజేతగా ప్రకటించారు. కానీ లంక ఎంపైర్ తప్పు చేయకపోయి ఉంటే.. న్యూజీలాండ్ విజేతగా నిలిచేది. ఎంపైర్ నిర్ణయంపై అప్పుడే సోషల్ మీడియాలో నెటిజన్లు భగ్గుమన్నారు. సీనియర్ క్రికెటర్లు కూడా ఎంపైర్ దే తప్పన్నారు.


తాజాగా ఆ ఎంపైర్ కూడా తన తప్పు ఒప్పుకుంటున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత రీప్లేలో చూసిన తర్వాత కానీ నేను చేసింది తప్పేనని అర్థమైందంటున్నాడు. ఇప్పుడు నేను క్షమాపణలు చెప్పినా ఉపయోగం ఉండదేమో. ఆ సమయంలో మరో అంపైర్ ఎరాస్మస్ తో చర్చించాను కూడా. మ్యాచ్ అధికారులు కూడా టీవీ రీప్లే వెంటనే చూడకపోవడం ఈ పరిస్థితికి దారితీసింది" అంటూ చావు కబురు చల్లగా చెబుతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: