ఒకవైపు తన ఓవర్ త్రో మరోవైపు అంపైర్ తప్పుడు నిర్ణయం కలగలిసి ప్రపంచ కప్ ఫైనల్ రోజు తాను నిరాశకు గురయ్యారని తన జీవితంలో అది ఒక చీకటి రోజు గా మిగిలిపోతుందని న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ అన్నాడు. న్యూజిలాండ్ తరఫున ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో లో ప్రాతినిధ్యం వహించి నందుకు గర్వపడిన రోజే తన ద్వారా జరిగిన ఓవర్ వల్ల న్యూజిలాండ్ జట్టు ఓడిపోవడానికి కారణమవడం తనను చాలా బాధిస్తుంది అన్నాడు.


మార్టిన్ గప్టిల్ బౌండరీ లైన్ దగ్గర నుండి విసిరిన బంతి ఇంగ్లండ్ ఆటగాడు బ్యాట్ కు తగిలి బౌండరీ చేరడం అదే సమయంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు రెండు పరుగులు సాధించారు మొత్తంగా ఆరు పరుగులు ఇంగ్లాండ్ జట్టు చేసినట్లు అంపైర్ కుమార ధర్మసేన ప్రకటించడం తెలిసిందే. దానితో స్కోర్ సమానమై మ్యాచ్ సూపరో వరకు చేరటం అక్కడ కూడా స్కోర్లు సమానమై అత్యధిక బౌండరీలు సాధించిన జట్టుగా ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ప్రపంచ కప్ నీ తొలిసారి ముద్దాడటం తెలిసిందే.


2015 లో జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ అద్భుతంగా ఆడిన ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వరల్డ్ కప్ బ్యాటుతో స్థాయికి తగ్గ ప్రదర్శన అయినప్పటికీ ఫీల్డింగ్లో ఆకట్టుకున్నాడు. భారత జట్టుతో జరిగిన సెమీఫైనల్లో మహేంద్ర సింగ్ dhoni రన్ అవుట్ కావటానికి దోహదం చేసిన అద్భుతమైన త్రో ఈ మెరుపు ఫీల్డర్ విసిరిన కావటం గమనార్హం. దానిని భారత జట్టు అభిమానులు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు అనడం లో సందేహం లేదు.


వరల్డ్ కప్ ఫైనల్ జరిగి వారం రోజులు గడిచిపోయాయని ఆ రోజే తన జీవితంలో అత్యంత ఆనందకరమైన మరియు బాధాకరమైన రోజని మార్టిన్ గప్టిల్ అన్నాడు. న్యూజిలాండ్ తరపున ఆడే అదృష్టం కలిగినందుకు ఆనందిస్తున్నానని తనకు సహకరించిన జట్టు సభ్యులకు మరియు మద్దతుదారులకు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేశాడు


మరింత సమాచారం తెలుసుకోండి: