క్రికెట్ లో ఒక్కోసారి అనేక చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతూంటాయి. అంపైర్లకే పరీక్ష పెడుతూంటాయి. ఇటివల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తోపాటు సూపర్ ఓవర్ టై అవడం, గుప్తిల్ ఓవర్ త్రోకు ఆరు పరుగులివ్వటంపై అంపైర్ల నిర్ణయానికి సవాల్ విసిరాయి. ఇదే ఉదాహరణతో తాజాగా సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ ఆసక్తికరమైన వీడియో పోస్ట్ చేశాడు.  

 

ఓ క్రెకెట్ మ్యాచ్ లో బౌలర్ వేసిన బాల్ బ్యాట్స్ మెన్ ను దాటి ఆఫ్ సైడ్ వికెట్ ను తాకింది. బ్యాట్స్ మెన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ‘అయితే ఔటే కదా.. ఇంకేంటి!’ అనుకుంటున్నారా.. ఇక్కడే ఓ విచిత్రం జరిగింది. బాల్ వికెట్ ను తాకింది కానీ.. ఆఫ్ సైడ్ వికెట్ పైనున్న బెయిల్ మాత్రం అదే వికెట్ పైన మధ్యకి చేరి కింద పడకుండా అలానే ఉండిపోయింది. దీంతో ఆటగాళ్లతో సహా ఎంపైర్లిద్దరూ స్తబ్దుగా ఉండిపోయారు. బ్యాట్స్ మెన్ అవుటయ్యాడా.. లేదా? అని బౌలర్, తాను ఔటయ్యానా లేదా అని బ్యాట్స్ మెన్ నిష్చేష్ఠులయ్యారు. ఏం నిర్ణయం తీసుకోవాలో తెలీక ఎంపైర్లు ఉండిపోయారు. దీనికి కారణమైన బెయిల్ మాత్రం కింద పడకుండా చాలా బ్యాలెన్సెడ్ గా, ఠీవీగా ఆఫ్ వికెట్ పై దర్జాగా కూర్చుంది.. మీరేం చేస్తారో చూస్తా! అన్నట్టుగా. తర్జనభర్జనల అనంతరం అంపైర్ “నాటౌట్” గా ప్రకటించారు.

 

ఫన్నీగా ఉన్న ఈ వీడియోను పోస్ట్ చేస్తూ “అసాధారణమైన ఈ సంఘటనను నా ఫ్రెండ్ పంపించాడు. మీరే అంపైర్ అయితే ఏం నిర్ణయం తీసుకుంటారు?” అంటూ మాస్టర్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. మ్యాచ్ ఎక్కడ జరిగింది, ఎవరి మధ్య అనేది ఇతిమిద్ధంగా తెలీలేదు. “బ్యాట్స్ మెన్ అరెస్టడ్ బట్ రిలీజ్డ్ ఆన్ బెయిల్”.. “ధర్మసేన అయితే ఔట్ ఇచ్చేసేవాడే” అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: