కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో బంగ్లాదేశ్‌తో శుక్రవారం లసిత్ మలింగ శ్రీలంక తరఫున తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. తన చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో మలింగ కీలకపాత్ర పోషించాడు, బంగ్లాదేశ్   2 ప్రారంభ వికెట్లు పడగొట్టాడు. అతను 3/28  ముగించాడు, వన్డే క్రికెట్లో తన చివరి వికెట్ను అందుకున్నాడు. అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా అంతర్జాతీయ వన్డే క్రికెట్  రిటైర్మెంట్ ప్రకటించాడు.


మలింగ సాదించిన కొన్ని రికార్డ్స్:
1. వన్డే చరిత్రలో శ్రీలంక తరఫున అత్యధికంగా వికెట్లు తీసిన వారిలో  మలింగ (338) మూడవ వాడు. ముత్తయ్య మురళీధరన్ (523), చమిందా వాస్ (399) మొదటి రెండు స్థానాల్లో  ఉన్నారు. ఇటీవల ముగిసిన ప్రపంచ కప్‌లో  శ్రీలంక తరఫున మలింగ అత్యధిక వికెట్లు (13) సాధించాడు.
2. శ్రీలంక బౌలర్‌కు అజంతా మెండిస్ తరువాత ఉత్తమ స్ట్రైక్ రేట్ (32.4) కూడా మలింగ సొంతం
3. వన్డేల్లో మూడు హ్యాట్రిక్ సాధించిన ఏకైక బౌలర్  మలింగ . అందులో రెండు హ్యాట్రిక్‌లు ప్రపంచ కప్‌లో వచ్చాయి, ఇది కూడా రికార్డు. వసీం అక్రమ్‌తో పాటు మలింగ మొత్తం 4 అంతర్జాతీయ హ్యాట్రిక్ సాధించాడు.
4. అంతర్జాతీయ క్రికెట్‌లో 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన ఏకైక బౌలర్  మలింగ.

కెరియర్ చివరిలో మలింగా ఫిట్నెస్ కి సంభందించి చాలా ట్రోల్స్ కి గురయ్యాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: