ప్రపంచకప్ నుంచి భారత్ నిష్ర్కమణ తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య గొడవలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ప్రపంచకప్ లో సెమీఫైనల్ వరుకు వచ్చిన ఇండియా సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ఓటమిపాలై ఇంటిదారి పట్టింది. 


దీంతో సోషల్ మీడియా వేధికగా భారత్ క్రికెట్ జట్టును ట్రోల్ చేశారు క్రికెట్ ప్రేమికులు. ఈ నేపథ్యంలోనే ఓ గాసిప్ బీసీసీఐ సీఈఓ ని రంగంలోకి దించింది. ఆ గాసిప్ ఏంటంటే రోహిత్ కి కోహ్లీ కి మధ్య గొడవలు జరుగుతున్నాయని ఆ గొడవలకు కారణం ప్రపంచకప్ సెమీఫైనల్ లో కోహ్లీ తీసుకున్న కొన్ని నిర్ణయాలే అని సోషల్ మీడియాలో పుకార్లు పుట్టుకొచ్చాయి. 


ఈ నేపథ్యంలోనే ఈ గొడవలు తగ్గించడానికి బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ, కోచ్ రవిశాస్త్రి ఇరువురి మధ్య గొడవలు పరిష్కరించి చర్చలు జరిపి సమస్య పరిష్కరం చేస్తారని వార్తలు వచ్చాయి. దీంతో ఈరోజు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. రవిశాస్త్రితో కలిసి ముంబైలో మీడియా ముందుకు వచ్చిన అయన వారి మధ్య ఎటువంటి విభేదాలు లేవని వెల్లడించారు. 


రోహిత్ తో నాకు ఎటువంటి విభేదాలు లేవు, ఒకవేళ మీరు చెప్పేది నిజమైతే మేము ఆటను అంత గొప్పగా ఆడేవాళ్లం కాదు, ఒకవేళ నాకు రోహిత్ నచ్చకపోతే నా ముఖంలోనూ, నా ప్రవర్తనలోనే ఆ విషయాన్నీ కచ్చితంగా చూస్తారు, మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని కోహ్లీ స్పష్టం చేశారు. మరి ఈ వార్తలపై రోహిత్ శర్మ ఎలా స్పందిస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: