ప్రపంచ కప్  ఫైనల్ మ్యాచ్ లో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి  టోర్నీ ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు తో పాటు కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నాడు  న్యూజిలాండ్ క్రికెట్ జట్టు  కెప్టెన్  కేన్  విలియమ్సన్‌ .  తాజాగా ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ  విలియమ్సన్‌  తన  జీవితం లోని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..


నేను  పుట్టి పెరిగింది న్యూజిలాండ్‌లోని సముద్రతీరాన వున్నా  టౌరంగా పట్టణంలో.  మా నాన్న బ్రెట్‌ విలియమ్సన్‌ క్లబ్‌ స్థాయి క్రికెటర్‌ కావడంతో  ఆటలో ఆయన దగ్గరే  ఓనమాలు  నేర్చుకున్నా. అమ్మ బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి. నాకు  ముగ్గురు అక్కలు  వారు వాలిబాల్ల్ ఆడేవారు అలాగే  ఒక తమ్ముడు కూడా వున్నాడు  వాడి పేరు  లోగాన్‌.   మేం ఇద్దరం  క్రికెట్‌తోపాటు ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, రగ్బీ కూడా ఆడేవాళ్లం. చివరకు నేను క్రికెట్‌లోకి వచ్చా, తమ్ముడు మాత్రం సీఏగా స్థిరపడ్డాడు.


సచినే నాకు  స్ఫూర్తి   చిన్నప్పటినుండి  ఆయన అట చూస్తూ  పెరిగా .. ఆలాగే  రికీ పాంటింగ్ , జాక్వెస్ కలిస్ లు ఆడుతుంటే ఇష్టంగా చూసేవాడిని.  ఆటవిడుపు కోసం సర్ఫింగ్ నేర్చుకున్నా అదంటే చాలా ఇష్టం అక్కడ ఎలాంటి  డిస్ట్రబెన్స్ ఉండదు. అలలను దూసుకుంటూ ముందుకు వెళ్తుంటే భలే సరదాగా అనిపిస్తుంది .  ఇక జీవిత భాగస్వామి విషయానికి వస్తే  ఇంగ్లాండ్ కు చెందిన సారా రహీమ్ ను పెళ్లి చేసుకున్నాను. వృత్తి రీత్యా ఆమె  నర్స్.  వారి కుటుంభం  న్యూజిలాండ్ లో స్థిరపడింది  అంటూ ముగించాడు  కేన్ విలియమ్సన్‌ .  


మరింత సమాచారం తెలుసుకోండి: