ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో వెస్టిండిస్‌తో శనివారం జరిగిన టీ20 సిరీస్ మొదటి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లకు గాను 96 పరుగులు చెయ్యగా భారత్ కేవలం 17. 2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది.   


అయితే టీమిండియా టాస్ గెలిచినప్పటికీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని యువ క్రికెటర్లకు చోటు కల్పించింది. ఈ తరహాలోనే తొలి టీ20లో బ్యాటింగ్‌లో మనీశ్‌ పాండేకి, బౌలింగ్‌లో నవదీప్‌ సైనీ, వాషింగ్టన్‌ సుందర్‌లకు జట్టు మేనేజ్‌మెంట్ అవకాశమిచ్చింది.


ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు భారత్ యువ క్రికెటర్లు. నవదీప్ సైని 3 వికెట్లు తియగా, భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు తీశారు. వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్, కృనాల్ పాండ్యా, రవీంద్ర జడేజాలు ఒకొక వికెట్ తీశారు. ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ(24), కెప్టెన్ కోహ్లీ, మనీష్ పాండే చెరో 19 పరుగులు చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: