నవదీప్ సైనీ.. ఇప్పుడు ఈ పేరు  భారత క్రికెట్ లో మారు మోగుతుంది. రంజీ అలాగే  ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేసి సెలెక్టర్ల దృష్టిలో పడ్డ సైని వెస్ట్ ఇండీస్ తో టీ 20 ,వన్దే సిరీస్ లకు ఎంపికయ్యాడు. ఆదివారం ఇండియా , వెస్ట్ ఇండీస్ ల మధ్య జరిగిన మొదటి టీ 20 మ్యాచ్ తో ఆంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టిన  సైని ఆ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేసి తన అరంగేట్రాన్ని  ఘనంగా చాటుకున్నాడు.  ఈమ్యాచ్ లో సైనీ  4 ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు.  

ఇక సైనీ 5ఏళ్ళ వయసులోనే   క్రికెట్ ఆడడం స్టార్ట్ చేసాడట. లోకల్ మ్యాచ్ లలో ఆడడంతో తన ప్రతిభ ఏంటో అక్కడున్నవారికి తెలిసింది. దాంతో సైనీ ని మ్యాచ్ కు 200 రూపాయల ఇచ్చి తమ జట్ల లో ఆడిపించుకునేవారు. సైనీ  క్రమంగా క్రమంగా  బౌలింగ్ లో రాటుదేలుతూ స్టేట్ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు . ఆ తరువాత ఢిల్లీ తరుపున రంజీ ఆడి దేశవాళీ క్రికెట్ లోకి అడుగుపెట్టిన సైనీ కి ఐపీల్ తో దశ తిరిగింది. ప్రస్తుతం  అతను  ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగుళురు తో కొనసాగుతున్నాడు. 2018 లో అతన్ని 3కోట్లకు దక్కించుకుంది. ఆ తరువాత ఢిల్లీ తరుపున రంజీ ఆడి దేశవాళీ క్రికెట్ లోకి అడుగుపెట్టిన సైనీ కి ఐపీల్ తో దశ తిరిగింది. ప్రస్తుతం  అతను  ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగుళురు తో కొనసాగుతున్నాడు. 2018 లో అతన్ని 3కోట్లకు దక్కించుకుంది. 


  ఇక సైని వెలుగులోకి రావడానికి టీం ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ కూడా ఓ కారణం.  సైనీ ప్రతిభను గుర్తించి  గంభీర్, ఢిల్లీ రంజీ జట్టు తరుపున ఆడించాలని ప్రతిపాదించాడు. అయితే బిషన్ బేడీ  , చేతన్ చౌహన్ లు సైనీ క్రికెట్ కు పనికారడంటూ బీసీసీఐ కు నివేదించారు.  అయినా కూడా గంభీర్ పట్టువదలకుండా సైనీ కి అండగా వుంటూ తన ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చాడు. గంభీర్ గురించి మాట్లాడినప్పుడల్లా నేను చాలా భావోద్వేగానికి గురైతానని ఇటీవల సైనీ అన్నాడు. 





మరింత సమాచారం తెలుసుకోండి: