ప్రపంచ కప్ లో  నిర్లక్ష్యంగా ఆడి  భారత  క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురైన  టీం ఇండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తాజాగా వెస్ట్ ఇండీస్ తో జరిగిన టీ 20 సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ ల్లో అదే ఆటను కొనసాగించాడు.  దాంతో  ధోని స్థానాన్ని భర్తీ చేస్తావనుకుంటే  చెత్తగా ఆడుతున్నావ్ అని అతని ఫై  అభిమానులు మరోసారి విమర్శలు గుప్పించారు.  


ఇ క రిషబ్ పంత్  ఎట్టకేలకు  మంగళవారం వెస్టిండీస్ తో జరిగిన చివరి టీ 20 మ్యాచ్ లో 65 పరుగులతో రాణించి ఫామ్ లోకి వచ్చాడు.  ఈమ్యాచ్ లో 42 బంతుల్లో 4 ఫోర్లు , 4 సిక్సర్ల సహాయం తో 65 పరుగులు చేసి  అజేయంగా నిలిచాడు పంత్.  ఇక  ఇన్నింగ్స్ తో  ధోని రికార్డు ను కూడా బద్దలు కొట్టాడు పంత్.  ఇంతకుముందు  ధోని  2017లో ఇంగ్లాండ్ ఫై  56 పరుగులు చేసి  టీ 20ల్లో అత్యధిక పరుగులు చేసిన  భారత వికెట్ కీపర్ గా రికార్డు నెలకొల్పగా తాజాగా రిషబ్ పంత్ 65 పరుగులతో ఆ రికార్డు ను బ్రేక్ చేశాడు.  


ఇక ప్రస్తుతం  వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీం ఇండియా, విండీస్ తో జరిగిన  టీ 20 సిరీస్ లో  3-0 తో గెలిచి  సిరీస్ ను  కైవసం చేసుకోని  వన్డే సిరీస్ పోరుకు సిద్దమవుతుంది.  అందులో భాగంగా ఈనెల  8న వెస్టిండీస్ , భారత్ జట్ల మధ్య గయానా లో మొదటి వన్డే మ్యాచ్ జరుగనుంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: