ప్రపంచకప్ నుంచి భారత్ నిష్ర్కమణ తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య విభేదాలు ఉన్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వచ్చి కొన్ని రోజులు హల్ చల్ చేశాయి.  అయితే వారి మధ్య ఎటువంటి విబేధాలు లేవు అని కోహ్లీ వివరణ ఇచ్చాడు. బీసీసీఐ కూడా ఇదే విషయం వెల్లడించింది. టీమిండియా కౌచ్ కూడా ఇదే విషయాన్నీ కోహ్లీతో పాటు వెల్లడించాడు. 


అయితే వారు వివరణ ఇచ్చినప్పుడు ఆ పుకార్లు ఆగిపోయినప్పటికీ మళ్ళి ఆ వివాదాలు తెరపైకి వచ్చాయి. తాజాగా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య వివాదంపై టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ, రోహిత్ మధ్య విభేదాలు ఉన్నట్టు వస్తున్న వార్తలు మరో 20 ఏళ్లైనా ఆగవని పేర్కొన్నాడు. 


బ్యాటింగ్‌లో రోహిత్ విఫలమైన ప్రతిసారీ ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయని, రోహిత్ తక్కువ స్కోరుకు అవుటైన ప్రతీసారి కోహ్లీతో విభేదాలు ఉన్నాయన్న కథనాలు వస్తూనే ఉంటాయని, ఉద్దేశపూర్వకంగా కొందరు ఇటువంటి కథనాలు సృష్టిస్తుంటారని, అలాంటి కథనాల వల్ల ఆటగాళ్లు కూడా ఇబ్బంది పడతారని ఆవేదన వ్యక్తం చేశాడు. కోహ్లీ, విరాట్ ఇద్దరూ ప్రొఫెషనల్సేనని, వారు జట్టు గెలుపు కోసమే ఆడతారని తేల్చిచెప్పాడు. అయితే గవాస్కర్ బాధపడుతూ ఈ వ్యాఖ్యలు చేసిన నెటిజన్లు మాత్రం ఈ వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు. అన్ని మరిచిపోయిన అభిమానులకు మళ్ళి ఈ గొడవలు గుర్తుచేస్తున్నారు అంటూ ఘాటు సమాధానాలు ఇస్తున్నారు నెటిజన్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: