యువ క్రికెటర్ శుభమన్ గిల్ ..  టీం ఇండియా మాజీ ఓపెనర్  గౌతమ్ గంభీర్  రికార్డు ను బద్దలు  కొట్టాడు. ఫలితంగా  గిల్  అతి చిన్న వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో  డబల్ సెంచరీ చేసిన అటగాడిగా రికార్డు సృష్టించాడు .   టీం  ఇండియా  సీనియర్ జట్టు తో  పాటు ఇండియా ఏ   జట్టు కూడా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో వుంది. అందులో భాగంగా  ప్రస్తుతం వెస్ట్ ఇండీస్ ఏ తో ఇండియా ఏ మూడవ అనధికారిక టెస్ట్ ఆడుతుంది. 


కాగా ఈ మూడవ  అనధికారిక టెస్ట్ మ్యాచ్ లో  శుభమాన్ గిల్ 19 ఫోర్లు, రెండు సిక్సర్లతో 204 పరుగులు తో చెలరేగి పోయాడు.  ఈ క్రమంలో 19 ఏళ్ల 334 రోజుల వయస్సులో టెస్టుల్లో ద్విశతకం సాధించిన భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.  కాగా 2002లో జింబాబ్వేతో జరిగిన బోర్డు ప్రెసిడెంట్‌ ఎలెవన్‌ టెస్టులో గంభీర్‌ ద్విశతకం సాధించాడు. అప్పుడు అతడి వయస్సు 20 ఏళ్ల 124 రోజులు.  


 ఇక ఈ మ్యాచ్ లో  ఇండియా ఏ సెకండ్ ఇన్నింగ్స్ లో 4వికెట్ల నష్టానికి  365 పరుగులు చేసి వెస్టిండీస్ ఏ కు  373 పరుగుల  లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. కాగా మూడోరోజు ఆట ముగిసేసమయానికి  విండీస్‌ ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా 37 పరుగులు చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: