Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 11:30 am IST

Menu &Sections

Search

మరో రెండు సంవత్సరాల వరకు కూడ రవిశాస్త్రి..

మరో రెండు సంవత్సరాల వరకు కూడ రవిశాస్త్రి..
మరో రెండు సంవత్సరాల వరకు కూడ రవిశాస్త్రి..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారత  క్రికెట్ జట్టుకు వరుసగా రెండోసారి భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి కోచ్‌గా నియమితులయ్యారు. కపిల్ దేవ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సిఎసి) షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ముంబైలో మీడియా సమావేశంలో ఈ ప్రకటన చేసింది. శాస్త్రిని  ఇంకొక 2 సంవత్సరాల వరకు తిరిగి నియమించారు, ఇది భారతదేశంలో ఆడబోయే 2021 ఐసిసి వరల్డ్ టి 20 వరకు కొనసాగుతుంది.


క్రికెట్ మేనేజర్ గా 2007 బంగ్లాదేశ్ పర్యటన , జట్టు డైరెక్టర్ గా 2014-2016,  ప్రధాన కోచ్ (2017-2019) గా  పనిచేసిన రవిశాస్త్రి కి ఇది జాతీయ జట్టుతో శాస్త్రికి నాల్గవ ఒప్పందం. "మూడవ స్థానం లో మూడీ, రెండవ స్థానంలో మైక్ హెస్సన్. మీరందరూ  ఊహించినట్లుగా మొదటి స్థానం లో రవిశాస్త్రి (కానీ) అందరికి ఇది చాలా దెగ్గరి పోటీ" అని కపిల్ విలేకరుల సమావేశంలో నిర్ణయం ప్రకటించారు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ నుండి  మరియు బహిరంగ మద్దతుతో  పూర్తి జట్టు అతనిని కొనసాగించడానికి మద్దతు ఇస్తున్నట్లు వచ్చిన నివేదికలతో, ప్రస్తుత కోచ్ గా మళ్ళీ తననే తీస్కున్నారు.2014 నుండి 2016 వరకు శాస్త్రి ఇండియా టీం డైరెక్టర్‌గా ఉన్నారు మరియు 2017 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అనిల్ కుంబ్లే పదవీవిరమణ చేసిన తరువాత ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. 2017 లో ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత మాజీ ఆల్‌రౌండర్ రికార్డు బాగా ఆకట్టుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్ట్ సిరీస్ విజయానికి మరియు గత సంవత్సరం దక్షిణాఫ్రికాలో 5-1 వన్డే సిరీస్ విజయానికి జట్టుకు మార్గనిర్దేశం చేయడం అతిపెద్ద ముఖ్యాంశాలలో ఒకటి.

జూలై 2017 నుండి ఆడిన 21 టెస్టుల్లో, శాస్త్రి కోచ్‌గా, భారత్ 13 గెలిచింది. అది 52.38 విజయ శాతం. 36 ఆటలలో 25 విజయాలు, 69.44 విజయ శాతంతో టి 20 లలో ఈ రికార్డు మెరుగ్గా ఉంది. వన్డే రికార్డు మాత్రం అధ్బుతం గా 60 ఆటలలో 43 విజయాలు మరియు 71.67 శాతం విజయవంతం.
కొంతమంది విమర్శకులు ఎత్తి చూపిన లోపాలు ఏమిటంటే, 2015 ఆస్ట్రేలియాలో జరిగిన ఐసిసి వన్డే ప్రపంచ కప్‌లో (అతను టీం డైరెక్టర్‌గా ఉన్నప్పుడు), ఈ ఏడాది యుకెలో జరిగిన మ్యాచ్ లో జట్టు సెమీకి మించి వెళ్ళలేకపోయింది.  వెస్టిండీస్ మాజీ ఓపెనర్ ఫిల్ సిమన్స్ శుక్రవారం రేసులో నుంచి

వైదొలగడానికి ముందే శాస్త్రితో సహా ఆరుగురు అభ్యర్థులు ఇండియా హెడ్ కోచ్ పదవి  జాబితాలో ఉన్నారు. ఈ ఐదుగురు అభ్యర్థులు న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెస్సన్, ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ మరియు శ్రీలంక మాజీ కోచ్ టామ్ మూడీ, మాజీ భారత జట్టు మేనేజర్ లాల్‌చంద్ రాజ్‌పుత్, భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ రాబిన్ సింగ్, రవిశాస్త్రి.


ravi-shastry
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.