విండీస్ పర్యటనలో టీమిండియా జట్టు ఫుల్ జోష్ లో ఉంది. ఏడు నెలల విరామం అనంతరం టీమిండియా జట్టు మళ్లీ టెస్టులకు సై అంటోంది. విండీస్ తో టీ20, వన్డే సిరీస్ లను గెలుచుకున్న భారత జట్టులో ఉత్సాహం ఉరకలేస్తోంది. అదే ప్రదర్శనను పునరావృతం చేయడం ద్వారా టెస్ట్‌ సిరీస్ నూ కైవసం చేసుకొని చాంపియన్ షిప్ లో ఘనంగా బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది. 


ఈ టెస్టు సిరీస్‌ను కూడా భారత్‌ గెలుచుకుంటే కోహ్లీ ఖాతాలో మరిన్ని రికార్డులు వచ్చి చేరుతాయి. ఈ సిరీస్‌ భారత్‌ గెలిస్తే కరీబియన్‌గడ్డపై రెండు సిరీస్‌లు గెలుచుకున్న ఏకైక భారత కెప్టెన్‌గా కోహ్లీ మరో రికార్డు సాధిస్తాడు. కాగా టెస్టు సిరీస్ గెలుపుపై కోహ్లీ గ్యాంగ్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరో వైపు వన్డే, టీ20 సిరీస్ ఓటమితో డైలామాలో పడ్డ విండీస్ టీమ్ టెస్టు సిరీస్ గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది.


కాగా టెస్ట్ క్రికెట్ ఫార్మటు లో భారత జట్టు తొలిసారిగా నెంబర్ లతో కూడిన జెర్సీ లతో బరిలోకి దిగనుంది. ఇక ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం కూడా లేదు. అయితే పిచ్‌ నుంచి పేసర్లకు మంచి సహకారం లభించనుంది. 


జట్లు (అంచనా)
భారత్‌: కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, పుజార, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), అజింక్యా రహానె, రోహిత్‌ శర్మ/హనుమ విహారి, రిషభ్‌ పంత్‌ (కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌/రవీంద్ర జడేజా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమి, జస్ర్పీత్‌ బుమ్రా.


వెస్టిండీస్‌: క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌, జాన్‌ క్యాంప్‌బెల్‌, షాయ్‌ హోప్‌, డారెన్‌ బ్రావో, హెట్‌మయర్‌, రోస్టన్‌ చేజ్‌, షేన్‌ డౌరిచ్‌, జాసన్‌ హోల్డర్‌ (కెప్టెన్‌), రఖీమ్‌ కార్న్‌వాల్‌/కీమో పాల్‌, కీమర్‌ రోచ్‌, షానన్‌ గాబ్రియెల్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: