అందరూ ఊహించినట్లు గానే టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఇన్నింగ్స్ ముగిసింది. ఎం‌ఎస్‌కే ప్రసాద్ నేతృత్వం లోని సెలక్షన్ కమిటీ టీమిండియా బ్యాటింగ్ కోచ్ గా మాజీ ఇండియన్ ఓపెనర్ ప్లేయర్ విక్రమ్ రాథోడ్ ను ఎంపిక చేసింది. కొద్ది రోజుల క్రితమ భారత ప్రధాన కోచ్ గా రవి శాస్త్రి ని కపిల్ దేవ్ నేతృత్వం లోని క్రికెట్ అడ్వైజరి కమిటీ నియమించింది. సహాయక సిబ్బంది ని నియమించడానికి ఎం‌ఎస్‌కే ప్రసాద్ నేతృత్వం లోని సెలక్షన్ కమిటీ ఈ ప్రక్రియ ను చేపట్టింది. ఊహించినట్లే బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ గా ఆర్.


శ్రీధర్ ల ను కొనసాగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూ చేసి ప్రతి విభాగం లో ముందు వరసలో నిలిచిన ముగ్గురు పేర్లను బి‌సి‌సి‌ఐ కి పంపిస్తుంది. సెలక్షన్ కమిటీ ఫైనల్ చేసిన వాళ్ళు బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ గా శ్రీధర్ మరియు బ్యాటింగ్ కోచ్ గా విక్రమ్ రాథోడ్.వారిని బి‌సి‌సి‌ఐ అధికారకం గా నియమిస్తుంది. బ్యాటింగ్ కోచ్ కి ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు 14 మంది అభ్యర్థులలో సెలక్షన్ కమిటీ ముగ్గురు అభ్యర్ధులని ఎంపిక చేసి వారి ముగ్గురి లో ఒకర్ని బ్యాటింగ్ కోచ్ గా నియమించింది.


సెలక్షన్ కమిటీ సెలక్ట్ చేసిన ముగ్గురిని పరిశీలించాక వాళ్ళలో మొదటి స్థానం విక్రమ్ రాథోడ్ తరువాత బంగార్ మరియు ఇంగ్లాండ్ యొక్క మార్క్ రాంప్రాకాష్ ఉన్నారు. ముందు నుంచి అనుకున్నట్లే బ్యాటింగ్ కోచ్ లో ఈ సారి మార్పు లు చూడొచ్చు అనుకున్నట్లే సంజయ్ బంగర్ ని కాదని విక్రమ్ రాథోడ్ ని ఎంపిక చేశారు. విక్రమ్ రాథోడ్ భారత్ తరుపున ఆరు టెస్టు లు, ఏడు వన్డేలు ఆడాడు కానీ పెద్దగా విజయవంతం కాలేకపోయాడు. కానీ దేశవాళీ క్రికెట్ లో పంజాబ్ తరుపున 146 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడి 49.66 సగటు తో 11743 పరుగులు చేశాడు.


అంతర్జాతీయ జట్లకు కోచ్ గా పనిచేసిన అనుభవం లేకపోయిన ఐ‌పి‌ఎల్ లో కింగ్స్ లెవెన్ , పంజాబ్ రంజీ జట్లకు కోచ్ గా పనిచేసిన అనుభవం ఉంది. ఇక టీమిండియా కొత్త ఫిజియోగా నితిన్ పటేల్ నియమితులయ్యారు. గతం లో కూడా ఈయన టీమిండియా కి పనిచేశాడు. గీరీష్ దొంగ్రే ని భారత జట్టు పరిపాలన మేనేజర్ గా నియమించారు ఈయన హైదరాబాద్ కు చెందిన వ్యక్తి.


మరింత సమాచారం తెలుసుకోండి: