విశ్వ విజేత పీవీ సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల సింగిల్స్ ఫైనల్ లో అద్వితీయ ప్రదర్శనతో సరి కొత్త చరిత్ర సృష్టించిన ఆమెకు దేశమంతా సాహో అంటుంది. తెలుగు తేజం సాధించిన ఈ ఘనత చూసి దేశం గర్విస్తోంది. పీవీ సింధును ప్రశంసల్లో ముంచెత్తుతోంది. దేశమంతా గర్వించే సమయమని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. కోర్టులో నువ్వు చేసిన మ్యాజిక్ శ్రమ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని అభినందించారు. బ్యాడ్మింటన్ పై విజయం ఎందరో ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తుందని అని ప్రశంచారు ప్రధాని మోదీ. 


మరోసారి దేశం గర్వపడే విజయాన్ని దక్కించుకుందని అభినందించారు. సింధు చరిత్ర సృష్టించిందని అన్నారు కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు. పీవీ సింధుతో పాటు కోచ్ కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఒలింపిక్స్ కు పది నెలల ముందు సింధు సాధించిన ఈ విజయం మొత్తం దేశానికే స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు రిజిజు. దేశం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న టైటిళ్లు మన తెలుగమ్మాయి కైవసం చేసుకోవడంతో సోషల్ మీడియాలో సింధుకు కంగ్రాట్స్ హోరెత్తాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ లు వివిధ పార్టీల నేతలు క్రీడాకారులు బాలీవుడ్ టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు కురిపించారు. అయితే ట్వీట్స్ లో కొన్ని పంచ్ లు పేలాయి. కాంగ్రెస్ చేసిన ట్వీట్ ను కొందరు తప్పుబట్టారు. మీ దేశానికి గర్వకారణంగా నిలిచామంటు కాంగ్రెస్ ట్వీట్ చేయడంతో కాంగ్రెస్ ది ఈ దేశం అంటూ కొందరు నెటిజన్ లు ప్రశ్నించారు.


ఇక సింధు ఆటోబయోగ్రఫీని సినిమాగా తీసేందుకు హీరోలు పోటీపడతారంటూ కొందరు ట్వీట్ చేశారు. అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం సింధు బయోపిక్ స్క్రిప్ట్ కోసం గొడవపడుతున్నట్లుగా ఫన్నీగా ఒకరు ట్వీట్ చేశారు. ఒకరైతే ఏకంగా సింధు బయోపిక్ తీసేందుకు అక్షయ్ కుమార్ రెడీ అవుతున్నారంటూ లేడీ గెటప్ ఫొటో షేర్ చేశారు. మరికొందరు పీవీ సింధు విజయాన్ని పీఎస్ ఎల్వీ రాకెట్ తో పోల్చారు. రాకెట్ ఏదైనా భారత్ వెలిగిపోతుంది అంటూ ట్వీట్ చేశారు. మొత్తానికి తెలుగు తేజం సాధించిన ఘనతను చూసి భారతదేశం మురిసిపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: