గత మూగేళ్లుగా వెండికే పరిమితమైన సింధు తాజాగా భారత బ్యాడ్మింటన్ చరిత్రలో రికార్డు సృష్టించింది. ఎవరు ఊహించని విధంగా సింధు ఇంకా వెండి పథకాలకే అంకితం అని ఓ ముద్ర పడే సమయం అది తొలిగించి భారతదేశ చరిత్రలోనే బాడ్మింటన్ లో ప్రపంచ విజేతగా నిలిచిన మొదటి ప్లేయర్ గా రికార్డు సృష్టించింది. 


ఈ రికార్డుతో ఆమెని ఎవరైతే వెండికే పరిమితం అని వ్యాఖ్యలు చేశారో వాళ్ళ నోరు మూయించింది సింధు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ నుంచి కేశినేని నాని వరుకు ప్రతి ఒక్కరు ఆమెని పొగాడతాలతో ముంచేస్తున్నారు. ప్రతిఒక్కరు ఆమెకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి కొందరు అయితే లక్షలు లక్షలు ప్రైజ్ మనీ ఇస్తున్నారు.


ఈ నేపథ్యంలోనే ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ సాధించిన సందర్భంగా పీవీ సింధును తెలంగాణ గవర్నర్ నరసింహన్ దంపతులు సన్మానించారు. హైదరాబాద్, రాజ్ భవన్ లోని దర్బార్ హాలులో బుధవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పారా షట్లర్ మానసి జోషిని కూడా గవర్నర్ దంపతులు సన్మానించారు. 


ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ... పీవీ సింధు దేశానికి గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. వచ్చే ఒలింపిక్ క్రీడల్లో సింధు కచ్ఛితంగా స్వర్ణం సాధిస్తారని ఆకాంక్షించారు. పారా షట్లర్ మానసి, ధైర్యానికి, పట్టుదలకు ప్రతీక అని ఎంతో మందికి ఆమె ఆదర్శంగా నిలిచారని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమానికి, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీ చంద్, సింధు కుటుంబసభ్యులు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: