విజయవాడలో ఫిట్ ఇండియా పేరుతో కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద చేపట్టిన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా   కలెక్టర్ ఇంతియాజ్స్వయంగా సైకిల్ తొక్కుతూ ర్యాలీలో పాల్గొన్నారు. నగర  సిపి ద్వారకా తిరుమలరావు, జాయింట్ కలెక్టర్ మాధవీలత, డిసిపి  విజయరావు, విజయవాడ మున్సిపల్ కమిషనర్  వెంకటేష్ ప్రసన్న, సీనియర్ ఐ.ఎ.యస్ అధికారి బాబు.ఎ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిట్ ఇండియా ర్యాలీ నిర్వహించామని చెప్పారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు నగరంలో నాలుగు ప్రాంతాల నుంచి తుమ్మలపల్లి వరకు ర్యాలీ నిర్వహించామని చెప్పారు.





రాష్ట్ర ప్రభుత్వం క్రీడా ప్రోత్సహకాలను అందిస్తుందని ఆయన తెలిపారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి మరింత అంతర్జాతీయ క్రీడాకారులుగా తయారు చేస్తామని చెప్పారు. కాగా వైయస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాల కింద బంగారు పతకం సాధించిన క్రీడాకారులకు రూ. 5 లక్షలు, రజతం సాధించిన వారికి రూ. 4 లక్షలు, కాంస్యం సాధించిన క్రీడాకారులకు రూ. 3 లక్షల ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. జూనియర్, సబ్‌ జూనియర్‌ స్థాయి క్రీడాకారులను గుర్తించాలని, ఈ కేటగిరీలో జాతీయ స్థాయిలో స్వర్ణం సాధించిన వారికి రూ. 1.25 లక్షలు, రజతం వచ్చిన వారికి రూ. 75 వేలు, కాంస్యం వచ్చిన వారికి రూ. 50 వేల ప్రోత్సాహకం ఇవ్వాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఏ సానియామీర్జాకో, పీటీ ఉషకో ప్రకటించలేదు.





అయినా ప్రభుత్వ ప్రకటనలు అంటే పెద్ద హోర్డింగులు, భారీ ఫ్లెక్సీలు నగరంలోని ప్రధాన రహదారుల్లో పెడతారు. అనంతరం సిపి ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ ఫిట్ గా ఉండేలా‌ వ్యాయామం, నడక ను అలవాటు చేసుకోవాలన్నారు. ఇటువంటి కార్యక్రమంలో మా పోలీస్  సిబ్బంది కూడా భాగస్వాములు కాబడం అనందంగా ఉందన్నారు. అసలు సానియామీర్జా ఈ మధ‌్య టెన్నిస్‌ ఆడడం లేదు..పీవీ సింధూ బాడ్మింటన్‌లో వరల్డ్ బాడ్మింటన్ చాంఫియన్ షిప్ టైటిల్ గెల్చుకుంది. ఒక వేళ సింధూ ఫోటో పెట్టి, బాడ్మింటన్ పెట్టినా అతికినట్లే ఉండేది..కానీ సానియా మీర్జా ఫోటో పెట్టి కావాలని పీటీ ఉష పేరు పెట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్నా ఎల్లోబ్యాచ్ పన్నాగం పారలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: