టీం ఇండియా యువ వికెట్ కీపర్  రిషబ్ పంత్ ఫై  విమర్శల పర్వం కొనసాగుతూనే వుంది. ఎంత మంది విమర్శించినా నా ఆట తీరును  మార్చుకోను అనే చందంగా  పంత్ వ్యవహరిస్తుండడంతో  భారత మాజీ క్రికెటర్లకు  అతని ఫై మండి పడుతున్నారు . 




విండీస్ పర్యటనలో  భాగంగా పరిమిత  ఓవర్ల క్రికెట్ లో   వరుసగా విఫలమైన పంత్ .. తనకు అచొచ్చిన టెస్ట్ ఫార్మట్ లోకూడా వెస్టిండీస్ తో జరిగిన  మొదటి టెస్ట్ మ్యాచ్ లో అదే ఫామ్ ను కొనసాగించడంతో  మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మానీ  పంత్ ను మందలించాడు. గ్లోవ్స్‌ ధరించిన ప్రతీ ఒక్కరూ వికెట్‌ కీపర్‌ కాలేరంటూ పరోక్షంగా పంత్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన  కిర్మాణీ ...  వృద్ధిమాన్‌ సాహాకు అండగా నిలిచాడు.  ఇటీవల కాలంలో పంత్‌కు పదే పదే అవకాశాలిస్తున్న టీమిండియా మేనేజ్‌మెంట్‌ సాహాను  ఎందుకు పట్టించుకోవడం  లేదంటూ ప్రశ్నించాడు.




ఒకవైపు పంత్‌ను పరీక్షిస్తూనే మరొకవైపు సాహాకు కూడా అవకాశాలు ఇవ్వాలని సూచించాడు.  విండీస్‌ తో జరిగిన తొలి టెస్టులో సాహాకు అవకాశం వస్తుందని భావించా కానీ  నిరాశే మిగిలింది.  సాహా మంచి వికెట్‌ కీపరే కాదు.. బ్యాట్స్‌మన్‌ కూడా. ఆ విషయాన్ని మరిచిపోకండి.  ఒక జత కీపింగ్‌ గ్లోవ్స్‌ ధరించిన ప్రతీ ఒక్కరూ వికెట్‌ కీపర్‌ కాలేరు కదా’ అని చురకలంటించిన  కిర్మాణీ  కనీసం రెండో టెస్టులోనైనా సాహాకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నానని  అన్నాడు.   

మరింత సమాచారం తెలుసుకోండి: