Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 4:37 pm IST

Menu &Sections

Search

ప్రముఖ భారత బ్యాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత చరిత్ర...

ప్రముఖ భారత బ్యాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత చరిత్ర...
ప్రముఖ భారత బ్యాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత చరిత్ర...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రముఖ భారత బ్యాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకం. సైనా నెహ్వాల్ హర్యానాలోని హిస్సార్ లో జన్మించింది. తల్లిదండ్రులిద్దరూ హర్యానా బాడ్మింటన్ చాంపియన్ షిప్ సాధించిన వారే. ఆమె తల్లిదండ్రులు చాలా సంవత్సరాలు బ్యాట్మింటన్ ఆడారు. ఆమె తల్లి ఉషారాణి హర్యానాలో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ క్రిడాకారిణి. జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ప్లేయర్ కావాలన్న తన తల్లి కలను నేరవేర్చడానికి నెహ్వాల్ బ్యాడ్మింటన్ నేర్చుకుంది. ఆమె సోదరి వాలీబాల్ క్రీడాకారిణి. ఇదంతా ఒక ఎత్తైతే నెహ్వాల్ కు కరాటీలో బ్రౌన్ బెల్ట్ కూడా ఉంది. హర్వీర్ సింగ్ నెహ్వాల్, ఉషా రాణి నెహ్వాల్ కు ఆమె హర్యానాలోని హిస్సార్ లో జన్మించారు. ఆమెకు ఒక అక్క మాత్రమే ఉంది. చంద్రశ్రీ నెహ్వాల్ ఆమె పేరు.

వ్యవసాయశాస్త్రంలో పీహెచ్ డీ చేసిన ఆమె తండ్రి చౌదరీ చరణ్ సింగ్ హర్యానా వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పనిచేసారు. హిస్సార్ లోని క్యాంపస్ స్కూల్ లో ఆమె ప్రాథమిక విద్య చదివారు. ఆపై తండ్రికి బదిలీ కావడంతో ఆమె హైదరాబాద్ వచ్చి ఇక్కడి మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ లో ఇంటర్ చదివారు. ఆమె తండ్రి పదోన్నతి పొంది హర్యానా నుండి హైదరాబాద్ బదిలీ అయిన నాటి నుంచి ఆమె బ్యాడ్మింటన్ నేర్చుకుంది. కుమార్తె అత్యున్నత స్థాయికి చేరాలన్నా ధ్యేయంతో ఆమె తండ్రి తన ప్రావిడెంట్ ఫండ్ ను వెచ్చించి మంచి బ్యాడ్మింటన్ శిక్షణ ఇప్పించారు. అలా సాధారణ స్థితి నుంచి ఆమె విజయపథం మొదలైంది. సైనా తన బ్యాడ్మింటన్ శిక్షణ ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్ ఎం ఆరిఫ్ దగ్గర ఆరంభించింది. అటుపై ఇండోనేషియా బ్యాడ్మింటన్ లెజెండ్ అతిక్ జవహార్ తో పాటు భారత మాజీ బ్యాడ్మింటన్ ఆటగాడు పుల్లెల గోపీచంద్ ఆమెకు శిక్షణలో ఆరితేరారు.


ఆల్ స్పీడ్ రిసెర్చ్ డైరెక్టరేట్ లో శాస్త్రవేత్త ఐన్ హర్వీర్ సింగ్ ఉషా రాణి నెహ్వాల్ దంపతులకు మార్చి పదిహేడు, పంతొమ్మిది వందల తొంభై సైనా నెహ్వాల్ జన్మించారు. ఒలంపిక్ క్రీడల్లో క్వార్టర్ ఫైనల్ చేరడమే కాకుండా ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ సాధించిన తొలి మహిళ ఆమె మాత్రమే. జూన్ ఇరవై రెండు వేల పదిన సింగపూర్ లో జరిగిన సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ టైటిల్ ను నెగ్గి రెండు సూపర్ సిరీస్ టైటిల్ ను సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణి. భారతీయ విజయ్ పతాకాలను ప్రపంచ క్రీడా వేదిక పై ఎగరవేశారు. భారతీయ బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ చరిత్ర సృష్టించారు. ప్రపంచం మొదటి ర్యాంకును సాధించిన తొలి భారత మహిళా బ్యాట్మింటన్ క్రీడాకారిణిగా రికార్డు పుటల్లో తన పేరును లిఖించుకున్నారు.

గతంలో పురుషుల్లో ప్రకాశ్ పదుకొనే మాత్రమే నెంబర్ వన్ పీఠం సాధించగలిగాడు. ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ సెమీస్ లో స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్ ఓటమి పాలవడంతో అగ్రపీఠం సైనా వశమైంది. ఈ టోర్నీలో సైనా జపాన్ క్రీడాకారిణి యు హషిమోటోతో ఆడాల్సి ఉన్నా ఈ మ్యాచ్ తో పని లేకుండానే నెంబర్ వన్ ర్యాంక్ కైవసమైంది. పుట్టింది హర్యానాలో అయినా ఎదిగింది, స్ధిరపడింది హైదరాబాద్ లోనే. అలా తెలుగు వెలుగును ప్రసరింపజేశారు ఆమె. ప్రపంచ ర్యాంకింగ్స్ లో భారత బాడ్మింటన్ స్టార్ హైదరాబాదీ సైనా నెహ్వాల్ నెంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లింది. న్యూఢిల్లీ ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్ చేరడం ద్వారా లీ జురుయ్ ను రెండో స్థానానికి నెట్టేసింది. ప్రపంచ నెంబర్ వన్ గా ఎదిగిన తొలి భారత మహిళగా రికార్డు సృష్టించింది. చైనా ఓపెన్ ను కైవసం చేసుకొని ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్ షిప్ లో ఫైనల్ కు చేరుకుని సంచలనాలు సృష్టించిన సైనా మరోసారి సత్తా చాటింది.


భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ వరల్డ్ నెంబర్ వన్ అయింది. బ్యాట్మింటన్ లో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ ని సాధించిన మహిళా క్రీడాకారిణిగా సైనా నెహ్వాల్ రికార్డు సృష్టించింది. ఇండియన్ ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్ షిప్ లో మారిన్ అనే క్రీడాకారిణి మీద సైనా విజయం సాధించటంతో గేమ్ విజయంతో పాటు వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ కూడా సైనా సొంతమైంది. దీంతో ట్విటర్ లో ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయి. భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ల వివాహ రిసెప్షన్ హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ బ్యాట్మింటన్ ప్రేమికులు డిసెంబర్ పద్నాలుగున చాలా సాదాసీదాగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే.నగరంలోని మాదాపూర్ లోని నోవాటెల్ హోటల్ లో సైన్, కశ్యప్ ల రిసెప్షన్ గ్రాండ్ గా సాగింది. ఈ కార్యక్రమానికి వీరు కుటుంబాల సన్నిహితులతో పాటు సినీ రాజకీయ క్రీడా రంగ ప్రముఖులు హాజరై ఈ జోడీని ఆశీర్వదించారు. అలాగే పెళ్లి కేవలం వంద మంది సమక్షంలోనే జరుపుకున్నారు. రెండు వేల ఐదులో బ్యాడ్మింటన్ క్రీడాకారులైన ఈ ఇద్దరూ హైదరాబాద్ లోని గోపీచంద్ అకాడమీలో కలిశారు. కొన్ని సంవత్సరాల పాటు స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ ఆపై ప్రేమికులుగా మారారు. దాదాపు పది సంవత్సరాల పాటు ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో పలుమార్లు వీరు కెమెరాలకు చిక్కిన ఇద్దరూ తమ మధ్య బంధాన్ని మాత్రం ఎప్పుడూ బయటపెట్టలేదు.


ప్రస్తుతం తమ ప్రేమ బంధాన్ని పెళ్లితో ముడిపెట్టి ఒక్కటయ్యారు. ఇప్పటికే పారుపల్లి కశ్యప్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ లో ఆరో స్థానంలో నిలిచాడు. కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణ పతకం సాధించాడు. ఇంకా ఇరవై ఎనిమిదేళ్ళ సైనా నెహ్వాల్ రెండు వేల పదిహేను లో టాప్ వన్ లో నిలిచింది. కామన్వెల్త్ లో రెండు వేల పది, రెండు వేల పధ్ధెనిమిదిలో స్వర్ణ పతకం సాధించింది. రెండు వేల పన్నెండు ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. రాకెట్ క్వీన్ సైనా నెహ్వాల్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నారు.


ఈ బయోపిక్ లో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ నటిస్తున్నది. ఈ సినిమా కోసం శ్రద్ధా కపూర్ బ్యాడ్మింటన్ లో కొన్ని శిక్షణలు కూడా తీసుకుంది. టీ సిరీస్ నిర్మాణంలో భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అమోల్ గుప్తే దర్శకత్వం వహించడం విశేషం. చెప్పుకుంటూ పోతే ఆమె విజయాలు ఎన్నో ఈ ఆరడుగుల రాకెట్టు భారత క్రీడా జగతికి ఒక వెలుగు రేఖ. ఈ హైదరాబాదీ స్పోర్ట్స్ స్టార్ యువతకు ఓ వ్యక్తిత్వ పాటం. ఆమె రియల్ స్టోరీ నిండా అద్భుతాలు ఎన్నో. స్వయంకృషి గెలవాలన్న కసి ఆమె క్రీడా జీవితానికి ఇంధనాలు. ఇలాంటి విజేతల గురించి చూసినా చాలు మన నరనరాల్లో విజయోత్సాహం ఉరకలేస్తోంది.


saina-nehval
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.