విదేశీ గడ్డపై మరో టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకుంది భారత్.  విండీస్ పర్యటనలో భాగంగా జరిగిన రెండు టెస్ట్ల సిరీస్ లో మొదటి టెస్ట్ ను  భారీ తేడాతో గెలుచుకున్న భారత్ .. తాజాగా జరిగిన  రెండో టెస్ట్ లోనూ  వెస్టిండీస్‌ చిత్తుగా ఓడించింది.  తద్వారా  ఈ విజయం తో టీం ఇండియా  పలు కొత్త రికార్డులు సృష్టించింది. అందులో భాగంగా వెస్టిండీస్ గడ్డ ఫై తొలిసారి టెస్ట్‌ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఘనత సాధించింది. అదే విధంగా ఐసీసీ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో 120 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.



ఇక ఈ  విజయం ద్వారా  కోహ్లి ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.  కోహ్లీ ఇప్పటివరకు  48 టెస్టులకు సారథ్యం వహించగా  అందులో  28 మ్యాచ్ ల్లో  ఇండియా గెలిచింది.  తద్వారా టీమిండియా మాజీ సారథి ధోని రికార్డు ను బద్దలు  కొట్టి  అందరికంటే ఎక్కువ విజయాలు సాధించిన భారత సారథిగా చరిత్ర సృష్టించాడు కోహ్లీ.  అంతకుముందు భారత్ ,ధోని కెప్టెన్సీ లో 27 మ్యాచ్‌లు గెలువగా ... ధోని విజయాల శాతం 45గా ఉండేది.




తాజాగా  కోహ్లి 55.31 శాతం విజయాలతో అతడి రికార్డు ను  బ్రేక్‌ చేశాడు.   కాగా ప్రస్తుతం ఓవరాల్‌గా అత్యధిక టెస్టు మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్ల జాబితాలో స్టీవ్‌ వా 36విజయాలతో ,రికీ పాంటింగ్ 33విజయాలతో మొదటి, రెండు స్థానాలో ఉండగా కోహ్లి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక కోహ్లీ సాధించిన  ఈ రికార్డు  కు అతని ఫై ప్రశంసలు కురిపిస్తున్నారు క్రికెట్ ;అభిమానులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: