పోరాట పటిమ ఆమె సొంతం

 అంతులేని పోరాట పటిమ గల క్రీడాకారిణి మిథాలీ రాజ్ అని భారత క్రికెట్  టెస్ట్ జట్టు క్రీడాకారుడు ఛతేశ్వర్ పూజారా కొనియాడాడు. అద్భుతమైన నా తన క్రీడా నైపుణ్యంతో మిథాలీ రాజ్ ఎందరో మహిళా క్రికెట్ క్రీడాకారులకు మార్గదర్శకంగా నిలిచిందని, ఎన్ని సవాళ్లు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో తన ఆటను కొనసాగిందని  పూజారా అభినందించాడు. 

మిథాలీ రాజ్ టి20 క్రికెట్ కు వీడ్కోలు పలికిన సంగతి అందరికీ తెలిసినదే.  2021లో ప్రారంభమయ్యే మహిళా క్రికెట్ ప్రపంచ కప్పు సాధించడానికి పూర్తి స్థాయిలో సన్నద్ధం అవ్వడం కోసం పొట్టి క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు మిథాలీ రాజ్ చెప్పింది.

టి20 క్రికెట్కు వీడ్కోలు పలికిన సందర్భంగా మిథాలీ రాజ్ ను ఉద్దేశిస్తూ  పూజారా ట్వీట్ చేస్తూ ఎంతో మంచి t20 క్రీడాకారిణి అయిన నువ్వు నువ్వు ఎంతో మంది మహిళలకు మార్గదర్శకంగా  నిలిచావు అని పూజారా అభినందించాడు.

పొట్టి క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన మిథాలీ రాజ్ కు వ్యాఖ్యాత హర్ష భోగ్లే కూడా అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశాడు.   2021 మహిళల ప్రపంచ కప్ లో మిథాలీ మెరవాలని ఆశించాడు. అద్భుతమైన క్రీడాకారిణి అయిన మిథాలీ మహిళల పొట్టి క్రికెట్లో బాగా ఆడి ఎంతోమందిని అలరించిన ట్లు హర్ష భోగ్లే  ట్విట్టర్లో పేర్కొన్నాడు



మరింత సమాచారం తెలుసుకోండి: