ప్రపంచ టెస్ట్ క్రికెట్ టోర్నమెంట్లో రికార్డు సెంచరీ నమోదయింది. టెస్ట్ క్రికెట్ ప‌సికూన ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ ఈ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా ర‌హ్మ‌త్ షా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. గురువారం బంగ్లాదేశ్‌తో ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ టీంలో ఫ‌స్ట్ డౌన్‌ ఆటగాడిగా వచ్చిన ర‌హ్మ‌త్ షా సెంచరీ కొట్టాడు. 187 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 102 పరుగులు చేసి ఔటయ్యాడు.


ర‌హ్మ‌త్ షా తెలివైన బ్యాటింగ్‌తో మూడో వికెట్‌కు 29 పరుగులు... నాలుగో వికెట్‌కు 120 పరుగులు నమోదయ్యాయి. ఈక్రమంలోనే సెంచరీ కొట్టిన రహ్మత్ బంగ్లాదేశ్ స్పిన్న‌ర్లే టార్గెట్గా చేసుకొని భారీ షాట్లు ఆడాడు. ఇక రహ్మ‌త్‌కు గతంలో కూడా రెండు సార్లు సెంచరీ చేసే అరుదైన అవకాశం లభించింది. ఈ ఏడాది మార్చిలో ఐర్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్‌లో 98 పరుగులు చేసి అవుట్ అయిన రహ్మత్ త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.


అదే మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్లో 77 పరుగులు చేసి అవుటయ్యాడు. ఎట్టకేలకు బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో పట్టువదలని విక్రమార్కుడిలా మూడో ప్రయత్నంలో సెంచరీ సాధించి ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలో సెంచరీ కొట్టిన తొలి ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోయాడు.


ఆయా దేశాల తరఫున తొలి టెస్టు సెంచరీ సాధించిన వారు..
చార్లెస్‌ బ్యానర్‌మేన్‌( ఆస్ట్రేలియా)
అమినుల్‌ ఇస్లామ్‌(బంగ్లాదేశ్‌)


డబ్యూ జీ గ్రేస్‌(ఇంగ్లండ్‌)
లాలా అమర్‌నాథ్‌(భారత్‌)


కెవిన్‌ ఒబ్రియన్‌(ఐర్లాండ్‌)
డెమ్‌ష్టర్‌(న్యూజిలాండ్‌)


నాజర్‌ మహ్మద్‌(పాకిస్తాన్‌)
జిమ్మీ సింక్లైర్‌(దక్షిణాఫ్రికా)


సిదాత్‌ వెట్టిమ్యూనీ(శ్రీలంక)
క్లైఫర్డ్‌ రోచ్‌(వెస్టిండీస్‌)


డేవ్‌ హాటన్‌(జింబాబ్వే)
రహ్మత్‌ షా(అఫ్గానిస్తాన్‌)



మరింత సమాచారం తెలుసుకోండి: