నిషేధం తరువాత యాషెస్ సిరీస్ ద్వారా తొలి టెస్ట్ సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ స్టీవెన్ స్మిత్    తన పునరాగమనాన్ని మొదటి టెస్ట్ తోనే ఘనంగా చాటుకున్నాడు.   తొలి టెస్ట్ లో   రెండు ఇన్నింగ్స్ ల్లో రెండు సెంచరీలు , రెండవ టెస్ట్ లో  హాఫ్ సెంచరీ , నాల్గవ టెస్ట్ లో డబుల్ సెంచరీ ఇవి ప్రస్తుతం యాషెస్ సిరీస్ లో  స్మిత్ గణాంకాలు. వీటినే చూస్తేనే  అర్ధమవుతుంది  స్మిత్ ఏ రేంజ్ లో ఫామ్ లో వున్నాడోనని..  


ఈ సూపర్ ఫామ్ తో  స్మిత్  కొన్ని రికార్డులను  సృష్టించాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..   నాల్గో  టెస్ట్ లో సెంచరీ తో  మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డు ను బద్దలు కొట్టి   అతి తక్కువ ఇన్నింగ్స్ ల్లో  26వ శతకం సాధించిన ఆటగాళ్ల జాబితా లో  డాన్ బ్రాడ్ మాన్ తరువాతి స్థానంలో కొనసాగుతున్నాడు స్మిత్.  ఇంతకుముందు136 ఇన్నింగ్స్ లో  సచిన్  26వ శతకాలు సాధించి రెండో స్థానం లో ఉండగా తాజాగా  స్మిత్121 ఇన్నింగ్స్ ల్లోనే ఈ రికార్డును బ్రేక్ చేసి  సచిన్ ను  మూడో స్థానానికి పరిమితం చేశాడు. అలాగే  టెస్టుల్లో  ప్రస్తుతం  64 పైగా సగటు తో  కొనసాగుతున్న ఏకైక బ్యాట్స్ మెన్ గా  కూడా  స్మిత్ రికార్డు సృష్టించాడు.



వీటితో పాటు  యాషెస్ సిరిస్ ల్లో  ఆసీస్ దిగ్గజం  అలెన్ బోర్డర్  తరువాత వరుసగా  రెండు సార్లు  500 పరుగులు  చేసిన  ఆటగాడి  గా స్మిత్ రికార్డు సృష్టించాడు. ఇక ప్రస్తుత  టెస్ట్ సిరీస్ లో  ఇంగ్లాండ్  బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు స్మిత్.  అతను మొదటి ,రెండు టెస్టుల్లో  తమ  జట్టు ను గెలిపించగా మూడో టెస్ట్ కు గాయం కారణంగా  దూరమయ్యాడు.  ఆ టెస్ట్ లో అదృష్టవశాత్తు ఇంగ్లాండ్ గెలిచింది. ప్రస్తుతం జరుగుతున్న నాల్గవ టెస్ట్ లో స్మిత్  ద్విశతకం తో ఆసీస్ ను పటిష్ట స్థితిలో నిలిపాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: