టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై సోషల్ మీడియా వేధికగా కామెంట్లు జోకులు పేలుతున్నాయి. ఈ నెల 15 నుండి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే కాళిగా ఉన్న విరాట్ కోహ్లీ అర్ధ నగ్న ప్రదర్శన చేస్తూ ఓ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే ఇంకా అప్పటి నుండి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో విరాట్ కోహ్లీపై జోకులు పేలుతున్నాయి. 


అయితే ఈ మధ్యనే కొత్తగా వచ్చిన ట్రాఫిక్ చట్టాలను దృష్టిలో పెట్టుకొని విరాట్ కోహ్లీపై జోకులు పేలుస్తున్నారు నెటిజన్లు. విరాట్ కోహ్లీ ట్రాఫిక్ చలాన్ పడింది అనుకుంటా అందుకే ఇలా తయారయ్యాడు అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేస్తే మరికొందరు స్పందిస్తూ ఆ చలాన్ కట్టలేకా బట్టలు కూడా ఆమెసుకున్నట్టున్నాడు విరాట్ కోహ్లీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 


దీంతో ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు కూడా ఓ రేంజ్ లో కామెంట్లు పెడుతున్నారు. కాగా ప్రస్తుతం ఏర్పడిన ట్రాఫిక్ ఆంక్షలపై ఇప్పటికి విమర్శలు తగ్గడం లేదు. ఓ వాహనదారుడు మద్యం తాగి బండి నడిపినందుకు చలాన్ వేస్తే.. ఆ చలాన్ చూసి బైక్ నే తగలెట్టేసాడు ఓ యువకుడు. బైక్ ఖరీదు కంటే చలాన్ లోని బిల్లే ఎక్కువ ఉండటంతో ఆ యువకుడు ఆ పనిచేశాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: