శ్రీలంక సీనియర్ ఫాస్ట్ బౌలర్ మలింగ  గురువారం  న్యూజిలాండ్ తో జరిగిన  మూడో టీ 20 మ్యాచ్ లో  అదరగొట్టాడు. తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపిస్తూ  4బంతుల్లో  4 వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు.  పల్లకెలె వేదిక గా జరిగిన ఈమ్యాచ్ లో  టాస్ గెలిచి  బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణిత 20ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి  125 పరుగులు మాత్రమే చేయగలిగింది. న్యూజిలాండ్ స్పిన్నర్లు సాంట్నర్,  టాడ్ అస్ట్లే లు చెరో  3 వికెట్ల తో చెలరేగడం తో  శ్రీలంక స్వల్ప స్కోర్ కే  పరిమితం అయ్యింది. లంక  బ్యాట్స్ మెన్ లలో ఓపెనర్ గుణతిలక  30 పరుగులతో  రాణించాడు. 



అనంతరం స్వల్ప లక్ష్య  ఛేదన తో  బరిలోకి దిగిన న్యూ జిలాండ్ ను  దెబ్బతీశాడు  మలింగ. తనుకు మాత్రమే  సాధ్యమయ్యే  యార్కర్ల తో కివీస్ బ్యాట్స్ మెన్ ను భయపెడుతూ  నాలుగు బంతుల్లో  నాలుగు కీలక  వికెట్లు  తీసి మ్యాచ్ ను తమ వైపు తిప్పాడు. మొదటి ఓవర్లో  కేవలం రెండు పరుగులు ఇచ్చి  వికెట్ల ఖాతా  తెరవకుండానే ఆ ఓవర్ను ముగించిన మలింగా..  మూడో ఓవర్   మూడో బంతికి కోలిన్ మున్రో అవుట్ చేసి  మొదటి వికెట్ తీశాడు.  అదే ఓవర్లో మిగిలినమూడు బంతుల్లో  రూథర్ ఫోర్డ్ , కోలిన్ డి గ్రాండ్ హోమ్ , రాస్ టేలర్ లను  డకౌట్ చేసి నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి మలింగ చరిత్ర సృష్టించాడు. 




ఇంతకుముందు అతను  వన్డేల్లో కూడా  నాలుగు బంతుల్లోనాలుగు వికెట్లు తీసి  రికార్డు సృష్టించాడు.  మలింగ కు తోడు మిగిలిన బౌలర్లు  కూడా రాణించడంతో  న్యూజిలాండ్ 16ఓవర్లలో 88 పరుగులకే  అల్ అవుట్ అయ్యి ఓటమిని  చవిచూసింది. కివీస్ బ్యాట్స్ మెన్ లలో  కెప్టెన్ సౌతీ  28పరుగులతో అజేయంగా నిలిచాడు.  ఇక  ఈమ్యాచ్ లో 4ఓవర్లు వేసిన మలింగ 6పరుగులు మాత్రమే ఇచ్చి 5కీలక వికెట్లు పడగొట్టాడు.  మూడు మ్యాచ్ ల సిరీస్ లో 2- 1 తో సిరీస్ ను న్యూజిలాండ్  కైవసం చేసుకోగా  తాజా విజయం శ్రీలంక కు ఊరటనిచ్చింది. అద్భుతమైన  బౌలింగ్ తో అదరహో అనిపించినా మలింగ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ లభించగా  సౌథీ ప్లేయర్ అఫ్ ది సిరీస్ అవార్డు ను సొంతం చేసుకున్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి: