చదరంగం ఆటలో వందల్లోనే ట్రోఫీలు సాధించిన విశాఖ పిల్ల తొమ్మిది సంవత్సరాల దేవకీ నందన. జాతీయ అంతర్జాతీయ చదరంగం పోటీల్లో పాల్గొని పలు బహుమతులు గెలుచుకున్న చిన్నారి దేవకీ నందన. చదరంగం ఆడతానని మారం చేస్తే ఆడపిల్ల కదా వద్దని వారించలేదు ఆ తల్లిదండ్రులు.


చిట్టి తల్లి తనకు నచ్చిన చదరంగం లో రాణించాలని కోరుకున్నారు.అన్న తో కలిపి చందరంగం నేర్పించి ప్రోత్సహించారు.తల్లి తండ్రుల నమ్మకాన్ని వొమ్ము చెయ్యక, ఆటలో ప్రత్యర్థికి ధీటుగా నిలుస్తూ చదరంగం లో చిన్న వయసులోనే తనదయిన ముద్ర వేసి విజయాలు సాధిస్తూ వస్తుంది దేవకీ నందన.


2017 నుండి ఆడడం ప్రారంభించిన నందన ఆనతికాలం లోనే అనేకవిజయాలు సాధించడం విశేషం. రెండు నెలల కాలం లోనే జిల్లా స్థాయి పోటీల్లో అండర్ సెవెన్ పోటీల్లో గెలుపొంది తరువాత విజయ రథమే ఎక్కి వెనుతిరిగి చూడలేదు.


ప్రత్యర్థి వ్యూహాన్ని గమనించి ఎత్తుకు పై ఎత్తు వెయ్యడం లో దిట్ట. ఎదుటి వారు డిఫెన్స్ ఆడితే తన దూకుడును పెంచేస్తుంది. ఎదుటి వారు ఎటాక్ కు దిగితే డిఫెన్సె ఆడి చిత్తు చేయగల సత్తా గలది. జాతీయ స్థాయిలో రజతం గెలుపొందిన నందన వచ్చే ఏడాది గ్రీస్, జార్జియా లలో జరగబోయే అంతర్జాతీయ పోటీలకు కాక ఆసియ ఛాంపియన్షిప్,వెస్టన్ ఆసియ ఇంకా కామన్వెల్త్ పోటీల్లో కూడా అర్హత సాధించింది. అయితే ప్రపంచ స్థాయి పోటీలో పాల్గొనగల నందన వెసులుబాటుకు స్పాన్సర్ల కోసం చూస్తున్నారు.


ఫోన్లో గేములు, వీడియొ గేములు అంటూ టి వి లకు ఫోనులకు అతుక్కుపోతున్న ఈ తరుణం లో చిన్నపిల్లలకే కాక, చాలామందికి ఈ చిన్ని నందన ఆదర్శమే. ఈ చిట్టి చదరంగానికి అల్ ది బెస్ట్.


మరింత సమాచారం తెలుసుకోండి: