అంబటి రాయుడు మన తెలుగు క్రికెటర్. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ కప్ జట్టులో చోటు కోసం ఎంతో ప్రయత్నించి, చోటు దక్కించుకోలేక, బాధపడుత ఆవేశంలో ట్విట్టర్ లో 3 డి ట్విట్ పెట్టి ఉన్న అవకాశాన్ని కూడా చేజేతులారా జరా విడుచుకున్నాడు అంబటి రాయుడు. ఈ నేపథ్యంలోనే ఆ సమయంలో అంబటి రాయడు ఆవేశంలో క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. 


అయితే సీనియర్ల సలహా మేరకు రాజీనామాను వెనక్కి తీసుకొని అనుకోని రీతిలో మరోసారి క్రికెట్ జట్టులో చేరాడు అంబటి రాయుడు. ఈ నేపథ్యంలోనే ఆ ట్విట్ పై స్పందిస్తూ 3 డి ట్విట్ వల్ల అతన్ని పక్కన పెట్టారని అతను భావించడం లేదని, ఒకవేళ అది నిజమైతే ఆటగాళ్లు ఏం చేయాలన్నదానిని తాను ఊహించలేనన్నాడు. జట్టులో నాలుగో స్థానం కోసం బాగా శ్రమించానని, చోటు దక్కకపోవడంతో తీవ్ర నిరాశ గురయ్యాడని, అందుకే ఎంపికలో భాగంగా వేరేవారికి అవకాశం ఇచ్చి తనను పక్కన పెట్టి ఉండొచ్చని అన్నాడు అంబటి రాయుడు. అయితే ఆలా అవకాశం రాకపోవడంతోనే అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు.


అయితే అంబటి రాయుడు స్పందన చుసిన నెటిజన్లు స్పందిస్తూ 'రాయుడు నువ్వు గొప్ప ఆటగాడివి, ఆట మీద కాంసెంట్రేట్ చెయ్యి, ఆవేశం మీద కాదు అంటూ ఒకరు ట్విట్ పెడితే.. మరికొందరు స్పందిస్తూ 'ఒకొక్కసారి ఆటలో ఇలాంటివి జరుగుతాయి ఆ మాత్రన చిన్న చిన్నవాటికి రిటైర్మెంట్ ప్రకటిస్తారా ? ఆవేశంతో కాదు ఆలోచనతో నిర్ణయాలు తీసుకో' అంటూ సూచనలు ఇచ్చారు నెటిజన్లు. మరి ఈ సూచనలను అంబటి రాయుడు తీసుకుంటాడో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: