సెసిల్ రైట్ క్రికెట్‌లో ఈ పేరు ఇవాళ్టి వరకూ ఓ సంచలనం. 85 ఏళ్ల వయసులో కూడా క్రికెట్ ఆడి క్రీడాభిమానుల చేత ఔరా అనిపించుకున్నారు. ఆయన తన జీవితంలో ఎక్కువ భాగం క్రికెట్‌కే అంకితం చేశాడు. ఏడు వేలకుపైగా వికెట్లు  తీసిన చరిత్ర ఈయన సొంతం. నచ్చిన ఫుడ్‌ తినటమే తన ఫిట్‌నెస్‌ రహస్యమని చెబుతారు సెసిల్ రైట్. పెన్నీ లీగ్‌ ఆడి క్రికెట్‌కు గుడ్‌బై  చెప్పిన సెసిల్ రైట్‌ లైఫ్‌ జర్నీలో ఎన్నో ఆసక్తికర విషయాలున్నాయి.     


వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే. క్రికెట్‌కు వయసుతో సంబంధం లేదు. ఆటపై మక్కువ ఉంటే ఎంత వయస్సులో అయినా కొనసాగవచ్చు. ఈ విషయాన్ని వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ సెసిల్‌ రైట్‌  నిరూపించారు. రైట్‌ దాదాపు 85 ఏళ్ల వయసు. ఇంత లేటు వయసులో ఆటకు గుడ్ బై చెప్పిన ఆటగాడు బహుశా ఇతడేనేమో!!. 85 ఏళ్ల  వయసులో కూడా క్రికెట్‌ ఆడడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.నిజానికి...ఒక క్రికెటర్ గరిష్టంగా 40 ఏళ్ల వయసు వరకు క్రికెట్ ఆడతారు. లేదా ఇంకో రెండుమూడేళ్లు కొనసాగుతారు. ఆ తర్వాత మాత్రం రిటైర్మెంట్‌ ప్రకటించాల్సిందే. కానీ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ సెసిల్‌ రైట్‌  దాదాపు 85 ఏళ్ల వయసు వరకూ క్రికెట్ ఆడారు. వివ్‌ రిచర్డ్స్‌, గ్యారీ సోబర్స్‌, జోయెల్‌  గార్నర్‌, ఫ్రాంక్‌ వోరెల్‌ వంటి వెస్టిండీస్‌ దిగ్గజ క్రికెటర్లతో కలిసి ఆడారు సెసిల్ రైట్. ఫాస్ట్‌ బౌలరైన సెసిల్‌ రైట్‌ వెస్టిండీస్ కు చెందిన వ్యక్తి. అక్కడ బార్బడోస్‌తో మ్యాచ్‌లో జమైకాకు ప్రాతినిధ్యం వహించాడు. అనంతర కాలంలో  1959లో ఇంగ్లాండ్‌ వెళ్లి సెంట్రల్‌ లాంకాషైర్ టీమ్ తరపున ఆడాడు. ఎనిద్ అనే మహిళని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోయాడు.


ఇక...సెసిల్ రైట్ తన 85 ఏళ్ల జీవితంలో 60 ఏళ్లకుపైగా జీవితాన్ని క్రికెట్‌కే అంకితం చేశాడు. తన కెరీర్‌లో మొత్తంగా 7 వేలకు పైగా వికెట్లు తీశాడు. సగటున ప్రతీ 27 బంతులకు ఓ వికెట్ చొప్పున ఐదు  సీజన్లలో 538 వికెట్లు తీసిన చరిత్ర రైట్‌కు మాత్రమే ఉంది. క్రికెట్ కెరీర్‌ని ఇంత సుదీర్ఘకాలం నడిపించిన వ్యక్తి కూడా రైట్ కావడం విశేషం. దీనిపై స్పందించిన రైట్ "అంతా సవ్యంగా సాగుతోంది. ఇంత సుదీర్ఘంగా ఆడటానికి  కారణమేంటో నాకు తెలుసు. అవేంటో మీకు చెప్పను. నాకు నచ్చిన ప్రతి ఆహారాన్ని తినేవాడిని. ఎక్కువగా తాగను. ఎప్పుడో ఓసారి ఒక బీర్‌ సేవిస్తాను. నేనెప్పుడు ఫిట్‌గా ఉంటాను. ఈ మధ్యన నా వయసును సాకుగా  చూపి సాధనకు వెళ్లడం లేదు. ఇంట్లో కూర్చొని టీవీ చూడటం నాకిష్టం ఉండదు. బయటకెళ్లి ఏదో ఓ పని చేయడం ఇష్టం" అంటూ చెప్పుకొచ్చారు. సెసిల్ రైట్... ఫాస్ట్ బౌలర్‌గా క్రికెట్ మైదానంలో దుమ్ము రేపారు. ఒకానొక సమయంలో ఐదు సీజన్లలో 538 వికెట్లు తీసి సంచలనం సృష్టించారు. ఇంత సుదీర్ఘమైన క్రికెట్ కెరీర్‌ని సాగించడానికి కారణం తన  ఆరోగ్యమే అంటారు.  ఆహార పరిమితులు పెద్దగా ఏం లేవని చెబుతూ నచ్చింది తినేస్తానంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: