కపిల్ దేవ్ నాయకత్నంలోని క్రికెట్ సలహా కమిటీ ఇటీవలే టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీంతో రవిశాస్త్రికి హెడ్ కోచ్‌గా బీసీసీఐ మరో రెండేళ్లు పొడిగించిన విషయం తెలిసిందే. కొత్త కోచ్ ఖాయమని ఎంత హడావిడి చేసిన రవిశాస్త్రికి మళ్ళి ప్రధాన కోచ్ పగ్గాలు అప్పగించారు. ఈ నేపథ్యంలోనే రవిశాస్త్రికి వేతనం భారీగా పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 


భారీగా అంటే భారీ అనే చెప్పాలి. రవిశాస్త్రి ఇప్పటికే సంవత్సరానికి 8 కోట్ల రూపాయిలు వేతనం అందుకోగా ఇప్పుడు కొత్త కాంట్రాక్టులో భాగంగా దాదాపు 20 శాతం వేతనం పెంచనున్నారట. అంత వేతనం అంటే మాములు విషయం కాదు. రవిశాస్త్రితో పాటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌ల వార్షిక వేతనం కూడా భారీ పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై బీసీసీఐ స్పందించాల్సి ఉంది.


అయితే ఇలా వార్తలు వచ్చాయో లేదో నెటిజన్లు సోషల్ మీడియా వేధికగా రవి శాస్త్రి వేతనం పెంపుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఎందుకు ఫైర్ అవుతున్నారు అని అనుకుంటున్నారా ? అదేనండి .. ఈసారి పక్క భారత్ వరల్డ్ కప్ లో గెలుస్తుంది అనుకుంటే హెడ్ కోచ్ ఎంపిక వల్ల ఓడిపోయాం కదా అందుకే. ఈ నేపథ్యంలోనే కొందరు స్పందిస్తూ ''టీమిండియా కోచ్ రవిశాస్త్రికి భారీగా వేతనం పెంపు నా.. ఎందుకు ?'' అంటూ ప్రశ్నిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: