ప్ర‌పంచ క్రికెట్ టోర్న‌మెంట్లోకి ప‌సికూన అప్ఘ‌నిస్తాన్ ఎంట్రీయే పెద్ద సంచ‌ల‌నం. అస‌లు అప్ఘ‌నిస్తాన్ ప‌రిస్థితులు చూస్తే ఆ దేశంలో ఆట‌గాళ్లు క్రికెట్ ఆడుతూ ఇంట‌ర్నేష‌న‌ల్ టోర్న‌మెంట్లులోకి అడుగు పెడ‌తార‌ని ఎవ్వ‌రూ ఊహించం. అలాంటి వాళ్లు ఏకంగా తొలిసారే వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు కూడా ఎంపిక‌య్యి ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేశారు. ఇక ఆ జ‌ట్టుకు టెస్ట్ హోదా రావ‌డంతో చాలా మంది ముక్కున వేలేసుకున్నారు.


జింబాబ్వే టెస్ట్ హోదా ర‌ద్దు చేయ‌డం ఏంటి అప్ఘ‌నిస్తాన్‌కు టెస్ట్ హోదా ఇవ్వండి ఏంట‌న్న ప్ర‌శ్న‌లు కూడా వ‌చ్చాయి. అయితే వాట‌న్నింటిని అప్ఘ‌న్ ప‌టాపంచ‌లు చేస్తూ టెస్ట్ క్రికెట్లో దూసుకుపోతోంది. గత ఏడాదే టెస్ట్ హోదా పొందిన అఫ్ఘన్ జట్టు తాను ఆడిన మూడుటెస్టుల్లోనే రెండో విజయం సాధించింది. తాజాగా బంగ్లాదేశ్‌తో బంగ్లాదేశ్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో అప్ఘ‌న్ ఘ‌న‌విజ‌యం సాధించింది. 398 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ను ఆఖరిరోజు ఆటలో కేవలం 173 పరుగుల స్కోరుకే అప్ఘన్ బౌలర్లు కుప్పకూల్చగలిగారు.


హాఫ్ సెంచరీతో పాటు 11 వికెట్లు పడగొట్టిన అప్ఘన్ కెప్టెన్ కమ్ లెగ్ స్పిన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అప్ఘాన్ టీంలో యువ ర‌షీద్‌ఖాన్ క్రియేట్ చేస్తోన్న సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కావు. ఇక గ‌తేడాది బెంగళూరు వేదికగా భారత్ తో టెస్ట్ అరంగేట్రం చేసిన అప్ఘన్ జట్టు తొలిటెస్టులో ఓటమి పొందినా …తన రెండోటెస్ట్ మ్యాచ్ లో ఐర్లాండ్ ను, మూడో మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను చిత్తు చేయడం ద్వారా తన సత్తా చాటుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: