గత ఏడాది స్మిత్  నిషేదానికి గురికావడంతో  టీమ్ పైన్  ను  ఆసీస్ కెప్టెన్  గా క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది.  అయితే  ఆ పదవికి తగ్గ న్యాయం మాత్రం  చేయలేకపోయాడు పైన్. కెప్టెన్సీ  పరంగా ఓకే కానీ బ్యాట్ తోని రాణించిన సందర్భాలు  చాలా అరుదు.  కెప్టెన్ అంటే జట్టు కష్టకాలం లో వున్నప్పుడు  ఒంటి చేత్తో మ్యాచ్ ను కాపాడుకోవాలి కానీ  ఇప్పటివరకు  అలాంటి  ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేకపోయాడు  పైన్.  దాంతో అతనిపై యాక్సిడెంటల్ కెప్టెన్ అనే ముద్ర పడిపోయింది. అయితే ఇప్పుడు ఈ యాక్సిడెంటల్ కెప్టెనే  మహామహులకు సాధ్యం కానీ  రికార్డు ను  సృష్టించేందుకు  రెడీ అవుతున్నాడు.


ప్రస్తుతం  జరుగుతున్న  యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా  నాలుగు మ్యాచ్ ల్లో రెండింట్లో విజయం సాధించగా , ఒక దాంట్లో ఓడిపోయి , ఒకటి డ్రా చేసుకుంది.  దాంతో  ఈ సిరీస్లో ఆ జట్టు 2-1 ఆధిక్యం లో నిలిచింది.  చివరి మ్యాచ్ లో కనుక  ఆసీస్ గెలవకపోయినా కనీసం..   డ్రా చేసుకుంటే చాలు ట్రోఫీ ను  కైవసం చేసుకుంటుంది.  ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే  ఒకవేళ ఆసీస్  ఈ సిరీస్ ను కనుక గెలిస్తే దాదాపు 18 సంవత్సరాల  తరువాత ఇంగ్లాండ్ గడ్డ ఫై  యాషెస్ గెలిచి చరిత్ర సృష్టించనుంది.



ఇంతకుముందు 2001 లో స్టీవా సారథ్యం లో  ఆసీస్ ఈఘనత సాధించగా  ఆతరువాత  లెజండరీ కెప్టెన్లు  రికీ పాంటింగ్ , మైకేల్ క్లార్క్  ఈ ఘనత  సాదించేందుకు  రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు.  ఇప్పుడు ఈ అరుదైన  అవకాశం పైన్ కు వచ్చింది.  మరి పైన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్టీవ్ వా సరసన నిలుస్తాడో లేదో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: