టీమిండియా కెప్టెన్ గా అద్భుతమైన రికార్డు సొంతం చేసుకున్న ధోనీకి సెప్టెంబర్ 13తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది.  ద్రావిడ్, సచిన్, గంగూలీల తర్వాత భారత జట్టు కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన ధోనీ  కెప్టెన్ గా తన తొలి టీ20 మ్యాచ్ ను సెప్టెంబర్ 13 2007 లో ఆడాడు. తొలి వరల్డ్ కప్ టీ20లో భాగంగా గ్రూప్ డి లో భారత్, ఐర్లాండ్ ల మధ్య జరిగిన మ్యాచ్ ద్వారా టీ20 కెప్టెన్ గా మహి తొలిసారి గ్రౌండ్ లోకి దిగాడు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మహేంద్రుడి ఫ్యాన్స్ #12YEARSCAPTAINDHONI అనే హ్యాష్ టాగ్ తో ట్వీట్ల వర్షం కురిపించారు.  కాగా ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా తొలిసారిగా జరిగిన వరల్డ్ కప్ టీ20లో టీమిండియాను విశ్వవిజేతగా నిలిపిన ధోనీ అక్కడి నుంచి భారత్ కు అద్భుతమైన విజయాలు అందించాడు.

కెప్టెన్ గా దాదాపుగా అన్ని ఐసీసీ ట్రోఫీలను భారత్ కు అందించిన ఘనతను కూడా ధోనీ సొంతం చేసుకున్నాడు. భారత జట్టుకు నాయకత్వం వహించిన కెప్టెన్లలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా రికార్డున్న మహి.. ప్రస్తుతం టీమిండియాకు మెంటార్ గా  నిలుస్తున్నాడు. కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఎదుగుతున్న తీరులో ధోనీ సలహాలు ఎంతో ప్రభావం చూపిస్తున్నాయనడంలో సందేహాం లేదు.

గత కొన్ని రోజులుగా ధోనీ రిటైర్మెంట్ ప్రకటన చేస్తారంటూ వార్తలు వస్తుండుగా.. ధోనీ అభిమానులతో పాటు పలువురు మాజీలు సైతం వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్ టీ20 దాకా ధోనీ జట్టులో ఉండాలని కోరుకుంటున్నారు.  అంచనాలకు అందకుండా నిర్ణయాలు తీసుకునే ధోనీ మరి తన రిటైర్మెంట్ పై ప్రకటన ఇస్తాడా లేక వచ్చే టీ20 వరల్డ్ కప్ దాకా జట్టుతో ఉంటాడా అనేది చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: