వెస్టిండీస్ పర్యటనని అజేయంగా ముగించిన భారత్ జట్టు నేటి నుంచి టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో ఢీకొట్టబోతోంది. ధర్మశాల వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకి తొలి టీ20 మ్యాచ్ ప్రారంభంకానుండగా ఈ మ్యాచ్‌కి వర్షం ముప్పు పొంచి ఉంది. సీనియర్, జూనియర్ల కలయికతో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌తో 2020‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌‌కి సన్నద్ధతని ఆరంభించబోతోంది.


రికార్డుల పరంగా చూసుకుంటే దక్షిణాఫ్రికాపై టీ20ల్లో భారత్‌దే ఆధిపత్యంలా కనిపిస్తోంది. ఈ రెండు జట్లూ ఇప్పటి వరకూ 13 టీ20ల్లో తలపడగా ఇందులో టీమిండియా ఎనిమిది మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో సఫారీలు విజయం సాధించారు. అయితే భారత్‌ గడ్డపై ఇప్పటి వరకూ దక్షిణాఫ్రికాతో జరిగిన అన్ని టీ20 మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఓడిపోయింది. నాలుగేళ్ల క్రితం ధర్మశాల వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లోనూ భారత్ ఓటమిని చవిచూసింది.


ఈ టీ20 సీరీస్ గాను రెండు దేశాల క్రీడాకారుల వివరాలు ఇలా ఉన్నాయి. భారత టీ20 జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కృనాల్‌ పాండ్య, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ షైనీ దక్షిణాఫ్రికా టీ20 జట్టు: డికాక్ (కెప్టెన్, వికెట్ కీపర్), దుస్సేన్ (వైస్ కెప్టెన్), బవుమా, జూనియర్ డాలా, బోర్న్ పోర్టుయిన్, హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్, ఫెహ్లుక్వాయో, పిట్రోరియస్, కగిసో రబాడ, షంషీ, స్మట్స్.


మొత్తానికి ఐపీల్ తరువాత భారతదేశంలో టీ20 సీరీస్ ఇదే కావడంతో భారత క్రికెట్ అభిమానులు చాలా వేచి చుస్తునారు.


మరింత సమాచారం తెలుసుకోండి: