ఇటీవల జరిగిన  ప్రపంచ కప్ ఫైనల్ లో  ఇంగ్లాండ్ ను ఒంటి చేత్తో గెలిపించి  హీరోగా మారిన ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్  .. తాజాగా జరిగిన   యాషెస్ సిరీస్ లోనూ  అదే ప్రదర్శన ను పునరావృతం చేసి 441 పరుగులతో ఇంగ్లాండ్ తరుపున టోర్నీ  టాప్ స్కోరర్ గా నిలిచాడు.  ముఖ్యంగా  యాషెస్ మూడో టెస్ట్ లో  స్టోక్స్ పోరాటం అద్భుతం. ఆమ్యాచ్ లో ఇంగ్లాండ్ ను  అసాధారణమైన ఆట తీరుతో గెలిపించాడు స్టోక్స్.  ఫలితంగా  ఇంగ్లాండ్ 2-2తో యాషెస్ సిరీస్ ను డ్రా చేసుకుంది.  


ఇక ఇదిలావుంటే  ఇంగ్లాండ్ జాతీయ  వార్త పత్రిక  ది సన్..    స్టోక్స్ వ్యక్తిగత  జీవితం  గురించి  ప్రచురించిన కథనం ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని షాక్ 
కు గురిచేస్తుంది.  ఇంతకీ ఆ కథనంఏంటంటే ..  స్టోక్స్ పుట్టక ముందు  తన  కుటుంభం లో తన అక్క ,అన్న  దారుణంగా  హత్య చేయబడతారు.  స్టోక్స్ అమ్మగారి  స్నేహితుడు ఈ దారుణానికి  ఒడిగతాడు. 30 ఏళ్ళ క్రితం జరిగిన ఈ మారణకాండ కథనాన్ని  ది సన్ పత్రిక  తాజాగా  స్టోక్స్ సీక్రెట్ ట్రాజెడీ అనే  పేరుతో  ప్రచురించింది. 


ఇక ఈ కథనం మాత్రం  స్టోక్స్ కు చిర్రెత్తుకొచ్చేలా  చేసింది.  మానిపోతున్న గాయాన్ని మళ్ళీ రేపింది  ది సన్ పత్రిక.  మూడు రోజుల క్రితం  ఈవిషయం గురించి  మా ఇంటికి వెళ్లి  మా కుటుంభ సభ్యులను  గుచ్చి గుచ్చి అడిగి వారిని తీవ్ర  ఆవేదన కు గురి చేశారు. ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం  జరిగిన  ఈ సంఘటన ను ఇప్పుడు బయటపెట్టి ఆ పత్రిక   ఏదో సాదించాననుకుంటుంది.  మా  వ్యక్తిగత  విషయాన్ని ఇలా బహిర్గతం చేయడం నన్ను చాలా బాధించింది. ఆ విలేకర్లకు  జర్నలిజం  విలువలు లేవనుకుంటా .. మీ వ్యక్తిగత  విషయాలను  కూడా ఇలాగే మొదటి పేజీ లోప్రచురించుకుంటారా  అని స్టోక్స్ నిప్పులు చెరిగాడు . 

మరింత సమాచారం తెలుసుకోండి: