ప్రముఖ  ఈకామర్స్ కంపెనీ  అమెజాన్...   పండుగ సీజన్  ను  ద్రుష్టి లో పెట్టుకొని  వినియోగదారులకోసం  గ్రేట్ ఇండియన్ సేల్ ను తీసుకొచ్చింది.  ఈనెల 29న అర్ధరాత్రి 12గంటలకు  ఈ సేల్ ప్రారంభం అయ్యి అక్టోబర్ 4 అర్ధరాత్రి 12గంటలకు ముగియనుంది.  అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రం  సెప్టెంబర్ 28  మధ్యాహ్నం 12గంటల  నుండే  ఈ సేల్ ను యాక్సెస్ చేసుకొనే వెసులుబాటును  కల్పించింది.  కాగా  కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ సేల్ ద్వారా  భారీ ఆఫర్లను ప్రకటించింది అమెజాన్.  అందులో  భాగంగా ఎలక్ట్రానిక్స్ , స్మార్ట్ టీవీలు , స్మార్స్మార్ట్ ఫోన్లు , గృహోపకరణాలు , ఫ్యాషన్ తదితర వస్తువులపై  భారీ డిస్కౌంట్  ప్రకటించనుంది.  అంతేకాకుండా  ఎస్ బి ఐ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసిన వారికీ  10శాతం ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా అందించనుంది. 




ఇదిలా ఉంటే  మరో  ప్రముఖ  ఈకామర్స్ కంపెనీ  ఫ్లిప్ కార్ట్  కూడా  దసరా పండుగ  సందర్భంగా  భారీ ఆఫర్లతో   బిగ్ బిలియన్ డేస్  సేల్ ను ప్రకటించింది.  కొద్దీ రోజుల క్రితమే  ఈ సేల్ డేట్ లను  రివీల్ చేసింది.   బిగ్ బిలియన్ సేల్ అలాగే గ్రేట్ ఇండియన్ సేల్ లు   ఓకే తేదికి  ప్రారంభమై ఒకే రోజు  ముగియనుండడం  కోస మెరుపు.  దాంతో  ఫ్లిప్ కార్ట్ , అమెజాన్ లమధ్య   తీవ్ర పోటీ నెలకొననుంది.   ఇక ఈ రెండు  కంపెనీలు ప్రకటించిన  సేల్ లతో  ఆన్ లైన్ షాపింగ్ ప్రియులకు పండగ కొంచెం ముందుగానే  స్టార్ట్ కానుంది. మరి ఇంకెందుకు ఆలస్యం  మీకు కావల్సిన వస్తువులను  విష్ లిస్ట్ చేసి పెట్టుకోండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: