టెస్ట్ , వన్డే ఫార్మాట్ లలో ఇప్పటికే  68 శతకాలు చేసి  రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్న టీం ఇండియా కెప్టెన్ విరాట్   కోహ్లీ...   టీ 20 ఫార్మట్ లో  కూడా తాజాగా  సరికొత్త రికార్డు లను నెలకొల్పాడు.  బుధవారం  మొహాలీ వేదికగా  సౌత్ ఆఫ్రికా తో జరిగిన రెండవ  టీ 20 మ్యాచ్ లో  కోహ్లీ 72 పరుగులతో  అజేయంగా నిలిచి  టీం ఇండియా ను  గెలిపించిన సంగతి తెలిసిందే.  ఈ ఇన్నింగ్స్ తో  కోహ్లీ  71 అంతర్జాతీయ  టీ 20  మ్యాచ్ లలో  2409 పరుగులు పూర్తి చేశాడు .   తద్వారా  అంతర్జాతీయ
  టీ 20ల్లో   అత్యధిక  పరుగులు చేసిన  ఆటగాడిగా  కోహ్లీ రికార్డు సృష్టించాడు. 




ఇదిలా ఉంటే  మూడు ఫార్మాట్లలో 50కి పైగా యావరేజ్  కలిగిన  ఏకైక బ్యాట్స్ మెన్ కూడా కోహ్లీ నే కావడం విశేషం.   కోహ్లీ .. టెస్టుల్లో 79 మ్యాచ్ లలో 53. 14 సగటు తో  6749 పరుగులు చేయగా   ఇందులో 25 శతకాలు వున్నాయి.   వన్డేల్లో  అతను  239మ్యాచ్ లలో 60. 31 సగటుతో 11520 పరుగులు చేశాడు. ఇందులో 43సెంచరీలు వున్నాయి.  ఇక పైన చెప్పినట్లు టీ 20 ఫార్మాట్ లో 71మ్యాచ్ లలో కోహ్లీ  50.19 సగటుతో 2409 పరుగులు చేశాడు. అలాగే  ఈపొట్టి ఫార్మాట్ లో అత్యధిక హాఫ్ సెంచరీలు మరియు    అత్యధిక  ఫోర్లు కొట్టిన  బ్యాట్స్ మెన్ కూడా  కోహ్లీ  రికార్డు నెలకొల్పాడు. అయితే  టీ 20ల్లో ఇంతవరకు  కోహ్లీకి శతకం అందని ద్రాక్ష లాగే ఉండిపోయింది. మరి కోహ్లీ త్వరలోనే ఆ ఘనత కూడా సాధిస్తాడో లేదో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: