భారత్ జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మొహాలి వేదికగా దక్షిణాఫ్రికాతో బుధవారం రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో సీరియస్ అయ్యాడు. ఫాస్ట్ బౌలర్ హార్దిక్ పాండ్య పదే పదే ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా బంతులేస్తూ బౌండరీలు ఇస్తుండటంతో ఒకానొక దశలో సహనం కోల్పోయిన రోహిత్ శర్మ.. వేలు చూపిస్తూ మరీ ఆ బంతులు వేయకు అంటూ వార్నింగ్ ఇచ్చాడు.

అప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీ లాంగాన్‌లో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తుండటంతో.. ధోనీ తరహాలో ఫీల్డింగ్ మార్పులు చేస్తూ కనిపించిన రోహిత్ శర్మ.. హార్దిక్‌కి బౌలింగ్ సూచనలు చేశాడు.
ఇన్నింగ్స్‌ 10వ ఓవర్ బౌలింగ్‌కి వచ్చిన హార్దిక్ పాండ్య.. ఆ ఓవర్‌ నాలుగో బంతిని ఆఫ్ స్టంప్‌కి వెలుపగా వైడ్ రూపంలో విసిరాడు.

దీంతో.. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ బవుమా (49: 43 బంతుల్లో 3x4, 1x6) ఆ బంతిని అలవోకగా హిట్ చేస్తూ ఓవర్ బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా బౌండరీ సాధించాడు. ఆ తర్వాత బంతిని కూడా హార్దిక్ పాండ్య అదే తరహాలో విసరగా.. బవుమా పాయింట్ దిశగా మళ్లీ ఫోర్ కొట్టాడు. దీంతో.. కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ వేలు చూపిస్తూ సీరియస్‌గా ‘ఆ బంతులు వేయద్దు’ అంటూ హెచ్చరించాడు.

ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ టీమ్‌‌కి రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడుతున్న హార్దిక్ పాండ్య.. ఈ వార్నింగ్ తర్వాత తన బౌలింగ్‌ తప్పిదాన్ని దిద్దుకుని పొదుపుగా బౌలింగ్ చేశాడు. రోహిత్ శర్మ ఇలా బౌలింగ్ సూచనలు చేస్తున్న సమయంలో.. బౌండరీ లైన్ వద్ద నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీ సైలెంట్‌గా చూస్తూ నిల్చొన్నాడు.


    మరింత సమాచారం తెలుసుకోండి: