క్రిస్టియానో రోనాల్డో.. ఫుట్ బాల్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. పోర్చుగ‌ల్ ఆట‌గాడు అయిన రొనాల్డో మైదానంలో బంతితో చేసిన విన్యాసాలు చూసి త‌రించాల్సిందే. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ చ‌రిత్ర‌లోనే అదిరిపోయే విధంగా 700 గోల్స్ చేసిన ఈ పోర్చుగల్ ఆటగాడు ఎన్నో అద్భుతమైన విజయాలను తన జట్టుకు అందించాడు.


ఇక రోనాల్డో లీగ్‌ల‌లో ఆడుతున్నా అత‌డిని కోట్లాది పెట్టి కోనుగోలు చేస్తుంటారు. ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ కోల్ కొట్టే వ్య‌క్తిగా అంద‌రి మ‌న‌స్సులు దోచుకున్న రొనాల్డోకు ఏ బెస్ట్ కోల్ కూడా త‌న‌కు సంతృప్తి ఇవ్వ‌దంటున్నాడు. 2017-18 చాంపియన్ లీగ్ లో క్వార్టర్ ఫైనల్ లో రియల్ మాడ్రిడ్ తరుఫున రోనాల్డో తలకిందులుగా ఎడమకాలితో గోల్ పోస్టులోకి కొట్టిన షాట్ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని ఫుట్ బాల్ పండితులు ఘంటాపథంగా చెబుతుంటారు.


ఇదే విషయాన్ని తాజాగా ఓ విలేకరి రోనాల్డోను అడిగేశాడు. అత‌డు మాత్రం ఎంత మంచి గోల్స్ కూడా త‌న‌కు సంతృప్తి ఇవ్వ‌వ‌ని త‌న గర్ల్ ఫ్రెండ్ 24 ఏళ్ల జార్జినా రోడ్రిగ్వేతో సెక్స్ లో లభించే సుఖం కంటే ఆ గోల్ బ‌లాదూర్ అని సంచ‌ల‌న కామెంట్ చేశాడు. త‌న జీవితంలో చేసిన ఏ గోల్ క‌న్నా కూడా తన ప్రియసితో సెక్స్ సుఖమే తనకు మిన్న అని రోనాల్డో అనడం విశేషం.


ఇక రొనాల్డో వ్య‌క్తిగ‌త విష‌యానికి వ‌స్తే ఇప్ప‌టికే రష్యా మోడల్ ఇరినాతోపాటు ఇద్దరు ముగ్గురితో సహజీవనం చేసి ఆరుగురికి తండ్రి అయ్యాడు. తాజాగా 24 ఏళ్ల స్పెయిన్ మోడల్ జార్జీనా రోడ్రిగ్యూజ్ తో సహజీవనం చేస్తున్నాడు. ఆమెతో ఒక కూతురును కన్నాడు. ఇక ఆమెను త్వ‌ర‌లో పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: