బుధవారం సౌత్ ఆఫ్రికా తో జరిగిన  రెండవ టీ 20మ్యాచ్ లో కెప్టెన్ కోహ్లీ  72 పరుగుల తో  అజేయంగా  నిలిచి  టీం ఇండియా ను  గెలిపించిన విషయం తెల్సిందే. ఈనేపథ్యంలో అంతర్జాతీయ టీ 20మ్యాచ్ ల్లో  అత్యధిక పరుగులు చేసిన  ఆటగాడిగా చరిత్ర సృష్టించిన  కోహ్లీ..  అదే ఫార్మాట్ లో  మరో రికార్డు  నెలకొల్పడానికి  అడుగు దూరంలో నిలిచాడు. గత మ్యాచ్ లో మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు వరించడం తో కోహ్లీ ఇప్పటివరకు టీ 20ల్లో  11 సార్లు  మ్యాన్ అఫ్ మ్యాచ్ ను గెల్చుకొని  పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది  రికార్డు ను సమం చేశాడు.   



అయితే ఈ జాబితాలో  ప్రస్తుతం ఆఫ్ఘానిస్తాన్ అల్ రౌండర్ నబీ 12మ్యాన్ అఫ్ ది మ్యాచ్ లతో అగ్ర స్థానం లో కొనసాగుతున్నాడు.  కాగా ఆదివారం జరిగే మ్యాచ్ లో కూడా  కోహ్లీ అదరగొట్టి  మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు ను గెల్చుకుంటే  నబి రికార్డు ను సమం చేస్తాడు.  మరి కోహ్లీ  ఆదివారం జరుగనున్న  మ్యాచ్ ద్వారా  12వ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ సాధిస్తాడా లేదో  చూడాలి.



ఇదిలా ఉంటే  ప్రస్తుతం పొట్టి ఫార్మాట్ లో ఆఫ్ఘానిస్తాన్  ఓటమి లేకుండా  దూసుకుపోతుంది.  2016నుండి 17సీజన్ లో ఆజట్టు  వరుసగా 11 టీ 20మ్యాచ్ లను గెలుచుకోగా ... 2018 ఫిబ్రవరి నుండి  ఇప్పటివరకు ఆజట్టు  వరుసగా మళ్ళీ 12విజయాలను సాధించి  తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: