ఆదివారం జరిగిన దక్షిణాఫ్రికాతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు ఓడిపోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 36 పరుగులు   25 బంతుల్లో 4 ఫోరులు , 2  సిక్సలు  మాత్రమే తీసాడు. మొదట  బ్యాటింగ్ చేసిన టీమిండియా  20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేయగా.. ఛేదనలో డికాక్ (79 నాటౌట్: 52 బంతుల్లో 6x4, 5x6) అజేయ హాఫ్ సెంచరీ బాదడంతో దక్షిణాఫ్రికా మరో 19 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది.

మ్యాచ్‌లో  బౌలింగ్ చేసి రెండు వికెట్లు పడగొట్టిన బురాన్ హెండ్రిక్స్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు.135 పరుగుల ఛేదనకి దిగిన దక్షిణాఫ్రికాని భారత్ బౌలర్లు మాత్రం ఏమి చేయలేక పోయారు.మొదటి ఓవర్ నుంచి టీమిండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగిన డికాక్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కి హెండ్రిక్స్ (28)తో కలిసి 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన డికాక్.. రెండో వికెట్‌కి బవుమా (27 నాటౌట్)తో కలిసి అజేయంగా 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి గెలుపును కైవసం చేసుకుందిమ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

అయితే.. ఓపెనర్ రోహిత్ శర్మ (9: 8 బంతుల్లో 2x4) ఆరంభంలోనే వికెట్ కి గురి అయ్యేడు.. అనంతరం వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (9: 15 బంతుల్లో) కూడా 9 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. కానీ.. ఒక ఎండ్‌లో నిలకడగా ఆడిన మరో ఓపెనర్ శిఖర్ ధావన్.. భారీ షాట్లట్ తీశారు. అయితే జట్టు స్కోరు 63 వద్ద సిక్స్ కొట్టే ప్రయత్నంలో ధావన్ ఔటవగా.. ఆ తర్వాత విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (19), శ్రేయాస్ అయ్యర్ (5), కృనాల్‌ పాండ్య (4), రవీంద్ర జడేజా (19), వాషింగ్టన్ సుందర్ (4), హార్దిక్ పాండ్య (14) వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకున్నారు.

దీంతో.. 134 పరుగులతోనే టీమిండియా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టీ20‌ల్లో ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 15 సార్లు తలపడగా.. ఏకంగా 9 మ్యాచ్‌ల్లో భారత్ జట్టు విజయాల్ని అందుకుంది. మిగిలిన ఆరింట్లో దక్షిణాఫ్రికా గెలుపొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి: