అవకాశాలు రాక కొందరు ట్యాలెంటెడ్ క్రికెటర్లు  మరుగునపడిపోతుంటే ..  అదృష్టం  కలిసి వచ్చి   వరుసగా   అవకాశాలు  వస్తున్న  నిరూపించుకోలేకపోతున్నాడు టీం ఇండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్. దాంతో అటు క్రికెట్ అభిమానుల దగ్గరనుండి   మాజీ క్రికెటర్ల వరకు పంత్ ఫై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.  ఇక  ఆదివారం జరిగిన మ్యాచ్ తో  విమర్శకుల నోర్లు మూయించే  లక్కీ ఛాన్స్  పంత్ కు వచ్చింది.  అయితే అలాంటి పని చేసి  నన్ను నేను తక్కువ చేసుకోలేనని అనుకున్నాడో ఏమో పంత్  ... ఆ మ్యాచ్ లోకూడా ఎప్పటి లాగే  చెత్త షాట్ ఆడి అవుట్ అయ్యాడు. 



ఆ మ్యాచ్ లో ఇండియా  ఓడిపోవడంతో  అందరి చూపు  పంత్ పైనే పడింది.  చూస్తూ ఊరుకోలేని నెటిజన్లు  ... పంత్ పోయి  గల్లి క్రికెట్ ఆడుకో .. దేశ కోసం ఆడడానికి నువ్వు పనికిరావు అని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.  ఐపీఎల్ లో సక్సెస్  అవుతున్న  పంత్ ..అంతర్జాతీయ క్రికెట్ లో ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాడు? అనేదే  ఇప్పుడు సగటు క్రీడాభిమాని ప్రశ్న..  అయితే పంత్ అంతర్జాతీయ క్రికెట్ లో  ఫెయిల్ కావడానికి టీం మేనేజ్ మెంట్ కూడా ఓ కారణం. పలువురు సీనియర్ క్రికెటర్లు  పంత్ ను నాల్గో స్థానం లో కాకుండా 5లేదా  6 ఆస్థానంలో పంపించి చూడాలని  ఇప్పటికే మేనేజ్ మెంట్ కు సూచించారు. అయితే కోచ్ రవి శాస్త్రి మాత్రం  నాలుగో స్థానంలో పంత్  కాకుండా  వేరే వారిని పంపితే ఏదో కొంపలు మునియోగిపోయినట్లు వ్యవహరిస్తుండండంతో ఆ స్థానంలో బ్యాటింగ్ వెళ్తున్న పంత్ ఒత్తిడికి చితై అలా  వెళ్లి ఇలా వస్తున్నాడు. అలా  కాకుండా ఓసారి 5లేదా 6స్థానంలో  పంపించి చూస్తే  అప్పుడు పంత్  భవిత్యం ఫై ఓ నిర్ణయానికి  రావొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: