వివిఎస్ లక్ష్మణ్ రిటైర్మెంట్ తరువాత  టెస్టుల్లో   భారత్ తరుపున  ప్రాతినిధ్యం  వహించే  తెలుగోడు లేడే అని  తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు  ఎక్కోడో  ఓ తెలియని బాధ ఉండేది. అయితే  నేనున్నానంటూ  ఆలోటును ప్రస్తుతం  హనుమ  విహారి   తీరుస్తున్నాడు. ఇటీవలే  ఈ ఆంధ్రా క్రికెటర్ టెస్ట్ జట్టు  లోకి ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నాడు.  రానున్న సౌత్  ఆఫ్రికా టెస్ట్ సిరీస్ లో కూడా  రాణిస్తే  విహారి  జట్టులో రెగ్యులర్  ప్లేయర్  కానున్నడం  పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. 



ఇక  ఇప్పుడు విహారి తోపాటు   త్వరలో నేను కూడా  టీం ఇండియా  టెస్ట్ జట్టులో ఆడుతానని  అంటున్నాడు విశాఖ కుర్రాడు ,ఆంధ్రా రంజీ క్రికెటర్  సి కె భరత్...   భరత్  బ్యాట్స్ మెన్ మాత్రమే కాదు మంచి కీపర్ కూడా  ప్రస్తుతం దేశవాళీ  క్రికెట్ లో సెంచరీలు మీద  సెంచరీలు చేస్తూ  రిషబ్ పంత్ , వృద్ధిమాన్ సాహా కు సవాలు విసురుతున్నాడు. దేశవాళీ తోపాటు ఇండియా ఏ తరపున ఆడిన భరత్ అద్భుతంగా రాణిస్తూ  సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు.   చురుగ్గా  కదలడం ,రెప్ప పాటు తేడాతో  స్టంప్ అవుట్ చేయడం,  ఓపిక ఎక్కువగా ఉండడం  ఇవి భరత్ ప్రత్యేకతలు. వీటిన్నింటికీ కన్నా చీఫ్ సెలెక్టర్  ఎంఎస్ కె  ప్రసాద్  అండ ఉండడం  భరత్ కు కలిసి రానుంది.  ఇటీవల ఎంఎస్ కె  ప్రసాద్  పంత్ కు పని భారం ఎక్కువతుందని అది తగ్గించడానికి ప్రత్యామ్నాయంగా  మరో వికెట్ కీపర్ ను తయారు చేస్తున్నామని మీడియా తో వెల్లడించాడు. ఆ కీపర్ ఎవరో కాదో భరతే.  ప్రస్తుతం పంత్  పేలమైన ఫామ్ లో వున్నాడు. ఒకవేళ  సౌత్ ఆఫ్రికా తో జరుగనున్న టెస్ట్ సిరీస్ లో  కూడా అతను విఫలమైతే భరత్  కు లైన్ క్లియర్ అయినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: