ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో అద్వితీయమైన ప్రదర్శనలతో వెండి పతకం గెలుచుకున్న భారత రెజ్లర్‌ దీపక్‌ పునియా కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. 86 కిలోల విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచాడు. రిఫరీ వివాదాస్పద నిర్ణయంతో స్వర్ణం గెలవలేకపోయిన భజరంగ్‌ పునియా 65 కిలోల విభాగంలో తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ఇతర విభాగాల్లో భారత రెజ్లర్లు ర్యాంకుల పంట పండించడం గమనార్హం. (ఇరాన్)తో ఆడాల్సిన  గాయం కారణంగా హసన్ యాజ్దానీ ఫైనల్ నుంచి తప్పుకొని రజతంతో సర్దుకున్నాడు. ప్రపంచ చాంపియన్ యాజ్దానీ కంటే నాలుగు పాయింట్లు ముందున్న దీపక్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలబడ్డాడు.

తొలిసారి సీనియర్‌ విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న దీపక్‌ పునియా మడమ గాయంతో ఫైనల్‌ నుంచి తప్పుకొన్నాడు. దీంతో ఇరాన్‌ దిగ్గజ ఆటగాడు హసన్‌ యాజ్‌దాని స్వర్ణం అందుకున్నాడు. అతడి కన్నా 4 పాయింట్లు ఎక్కువ సాధించిన దీపక్‌ 82 పాయింట్లతో అగ్రస్థానానికి ఎగబాకాడు.

ఈ ఏడాది యాసర్‌ డోగులో రజతం, ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచి నిలకడగా రాణించడంతో అగ్రస్థానం సాధించాడు.ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం కైవసం చేసుకున్న భజరంగ్‌ తన అగ్రస్థానాన్ని స్వర్ణం గెలిచిన గడ్జి మురాద్‌ రషిదోవకు చేజార్చుకున్నాడు. 63 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

57 కిలోల విభాగంలో కాంస్యం గెలిచిన రవి దహియా టాప్‌-5లో నిలిచాడు. 39 పాయింట్లతో ఐదో స్ధానంలో నిలిచాడు. రాహుల్‌ అవారె ర్యాంకును అతడు గెలిచిన కాంస్యం రెండో స్థానానికి చేర్చింది.మహిళల విభాగంలో రెపిచేజ్‌లో కాంస్యం అందుకున్న వినేశ్‌ ఫొగాట్‌ (53 కిలోలు) నాలుగు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంకు సాధించింది. సీమా బిస్లా (50 కిలోలు) మూడు, పూజా దండా (59 కిలోలు) ఐదు, మంజు కుమారి మూడు స్థానాల్లో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: