అక్టోబర్ 3, 4 తేదీల్లో బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో జిల్లాస్థాయి ఆటల పోటీలు..
క్షణం తీరిక, కంటి మీద కునుకు లేకుండా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యే ప్రభుత్వ సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు ఒత్తిడి నుండి విముక్తి కల్పించేందుకు గుంటూరు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ జిల్లా స్థాయి ఆటల పోటీలను నిర్వహిస్తుంది. అక్టోబర్ 3, 4 తేదీల్లో గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి.



పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చిన వారిని విజయవాడలో అక్టోబర్ 14 నుండి 17వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసి...ఆ తర్వాత ప్రతిభ ఆధారంగా జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న వారు గుంటూరు జిల్లాపరిషత్ రోడ్లోని స్వశక్తి బిల్డింగ్ మొదటి అంతస్థులో ఉన్న స్టెప్ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5గంటల లోపు తమ బయోడేటాను అందించవచ్చు. 



 3వ తేదీ జరిగే క్రీడాంశాలు..
  1. అథ్లెటిక్స్, 2) బ్యాడ్మింటన్ 3) బ్రిడ్జ్  4)బాస్కెట్ బాల్,  5) క్యారమ్స్,  6) చెస్,  7) క్రికెట్, 8)ఫుట్ బాల్


4వ తేదీ జరిగే క్రీడాంశాలు ..
1) హాకీ, 2) కబడ్డీ, 3) టెన్నీస్, 4) పవర్ లిఫ్టింగ్, 5) టేబుల్ టెన్నిస్, 6) వాలీబాల్, 7) వెయిట్ లిఫ్టింగ్, 8) రెస్లింగ్, 9) స్విమ్మింగ్


మరింత సమాచారం తెలుసుకోండి: