ఇండియాలో క్రికెట్ కు ఎంత ఆదరణ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.  ఆ ఆదరణే బీసీసీఐ ని  ప్రపంచ క్రికెట్ ను శాసించేలా చేస్తుంది.   క్రికెట్ ద్వారా  బోర్డు ఆదాయం ఏడాదికి  కొన్ని వేల కోట్ల పైనే.  అందుకు తగ్గట్లే బోర్డు...  టీం ఇండియా ఆటగాళ్లను  గ్రేడ్ లు గా విభజించి  వారికీ  భారీ మొత్తాన్ని చెల్లిస్తుంది.  అయితే స్టార్ క్రికెటర్లు ధోని , విరాట్ కోహ్లీ  లు  యాడ్స్ ద్వారా  సంపాదించే మొత్తానికి బోర్డు నుండి అందుకుంటున్న రెమ్యునరేషన్ కి ఏ మాత్రం పోలిక లేదు. వీరితోపాటు  రోహిత్ శర్మ , శిఖర్ ధావన్ , హార్దిక్ పాండ్య లు కూడా బోర్డు ఇచ్చే దానికంటే  యాడ్స్ ద్వారా నే  ఎక్కువగా సంపాదిస్తున్నారు.  ఈ 5గురి సంపాదన ఎలా ఉందో  ఇప్పడూ చూద్దాం.. 

విరాట్ కోహ్లీ :

ఆటలోనే కాదు యాడ్స్ లోనే కింగే అని నిరూపించుకుంటున్నాడు టీం ఇండియా కెప్టెన్ కింగ్  కోహ్లీ.   దేశంలోనే కాదు ప్రపంచ క్రికెట్ లోనే  అత్యధిక ఆర్జన కలిగిన క్రికెటర్ గా కోహ్లీ  రికార్డు సృష్టించాడు. కోహ్లీ ఏ ప్లస్ గ్రేడ్ ఆటగాడు కాబట్టి  బోర్డు అతనికి ఏడాది కి 7కోట్లు చెల్లిస్తుంది. కాగా యాడ్స్  ద్వారా  కోహ్లీ సంపాదన 140కోట్లు..   ప్రస్తుతం  ఏం ఆర్ ఎఫ్ , పుమా , ఆడి  తదితర కంపెనీ లకు  కోహ్లీ ప్రచార కర్తగా  వ్యవహరిస్తున్నాడు. 


ధోని : 

ఈజాబితాలో  రెండవ స్థానంలో వున్నాడు ధోని..   ఏ గ్రేడ్ ఆటగాడు కాబట్టి ధోనికి  బోర్డు ఏడాదికి 5కోట్లు చెల్లిస్తుంది. ఇక యాడ్స్ ద్వారా  ధోని సంపాదన 120కోట్లు . 2014లో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిన క్రికెటర్ గా ధోని  ఫోర్బ్స్ లో  చోటు సంపాదించాడు.  ప్రస్తుతం ధోని పెప్సికో , రీబాక్ వంటి బ్రాండ్స్ కు  ప్రచార కర్తగా  వ్యవహరిస్తున్నాడు. 


హార్దిక్ పాండ్య : 

ధోని తరువాత  యాడ్స్  ద్వారా  భారీ మొత్తంలో   సంపాదిస్తున్నాడు హార్దిక్ పాండ్య ..  పాండ్య  గ్రేడ్ బి  ఆటగాడు కాబట్టి  బోర్డు అతనికి ఏడాదికి 3కోట్లు చెల్లిస్తుంది.  కాగా యాడ్స్ ద్వారా పాండ్య 14కోట్లు అందుకుంటున్నాడు.  తద్వారా  బోర్డు ఇచ్చేదాని కంటే 5రేట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడు ఈ అల్ రౌండర్.  ప్రస్తుతం అతను జిల్లెట్ , గల్ఫ్ ఆయిల్ , ఒప్పో మొబైల్స్ కు ప్రచారం చేస్తున్నాడు. 


రోహిత్ శర్మ : 

 ఇక  ప్రస్తుతం  టీం లో ధోని , కోహ్లీ తరువాత అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాడు రోహిత్ శర్మ ఈ జాబితాలో నాల్గో స్థానం లో వున్నాడు.  ఏ ప్లస్ గ్రేడ్  ఆటగాడు కాబట్టి రోహిత్ కు బోర్డు ఏడాదికి 7కోట్లు చెల్లిస్తుండగా  యాడ్స్ ద్వారా అతని సంపాదన 7.2కోట్లు. ప్రస్తుతం రోహిత్ చేతిలో  అడిడాస్ , హుబ్లాట్ , అరిస్టోకార్ట్ బ్యాగ్స్ వంటి  బ్రాండ్స్  వున్నాయి. 


శిఖర్ ధావన్ :

రోహిత్ శర్మ   తరువాత యాడ్స్ ద్వారా  భారీగా ఆర్జిస్తున్నాడు  అతని పార్ట్ నర్  , టీం ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్..   ఏ  గ్రేడ్ ఆటగాడైన శిఖర్ కు బోర్డు  ఏడాదికి 5కోట్లు చెల్లిస్తుండగా   యాడ్స్ ద్వారా  5.2కోట్లు ఆర్జిస్తున్నాడు ఈ ఓపెనర్ ప్రస్తుతం  ధావన్...  బోట్ , అల్ సిస్ వంటి విదేశీ  బ్రాండ్స్ కు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: