విశాఖపట్నం వేదికగా జరిగిన భారత్- దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్ లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. 203 పరుగుల తేడాతో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో అరుదైన రికార్డులు కూడా నమోదయ్యాయి. మొదటగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మొదటి సారి టెస్ట్ లో ఓపెనర్ గా ది రెండు ఇన్నింగ్సుల్లో రెండు సెంచరీలు చేసి ఆ ఫీట్ సాధించిన మొదటి టీం ఇండియా ఆటగాడిగా గుర్తింపు పొందాడు.


బౌలర్ అశ్విన్ అత్యంత వేగంగా 350 వికెట్లు తీసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. 66 వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న అశ్విన్ ఈ ఘనత సాధించాడు. అయితే మురళీధరన్ కూడా తన ౬౬వ టెస్ట్ మ్యాచ్ లో ఈ ఘనత దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు వీరిద్దరి పేరు పైన సంయుక్తంగా ఉంది. ఇకపోతే దక్షిణాఫ్రికా ఆటగాడు పీయడ్త్ 10 వ స్థానంలో వచ్చి హాఫ్ సెంచరీ చేసి ఇండియాలో టీం ఇండియాపై దక్షిణాఫ్రికా తరపున ఆ ఘనత సాధించిన మొదటి ఆటగాడిగా గుర్తింపు పొందాడు.


ఇక ఈ మ్యాచ్ లో మరో రికార్డు అత్యధిక సిక్లర్లది. ఈ మ్యాచ్ లో మొత్తం 37 సిక్సర్లు కొట్టారు. ఇప్పటి వరకు ఏ టెస్ట్ మ్యాచ్ లో కూడా ఇన్ని సిక్సర్లు బాదలేదు. మొదటి సారిగా అత్యధిక సిక్సర్లు బాదిన జట్లుగా ఆ రికార్డును భారత్- దక్షిణాఫ్రికా జట్లకు దక్కింది. ఇంతకు ముందు ఈ రికార్డు పాకిస్తాన్- న్యూజిలాండ్ జట్ల మధ్య ఉండేది. అప్పుడు సిక్సర్ల సంఖ్య 35. 37 సిక్సర్లతో  ఆ రికార్డును ఇండియా- దక్షిణాఫ్రికా బ్రేక్ చేసాయి. ఈ విధంగా విశాఖపట్నం సరికొత్త రికార్డులకు వేదికైంది.



మరింత సమాచారం తెలుసుకోండి: