భారత్ జట్టు వన్డే ఓపెనర్ గా సక్సెస్ అయిన రోహిత్ శర్మ , టెస్టు జట్టులో స్థానం కోసం అనివార్యంగా ఓపెనర్ అవతారం ఎత్తాడు . భారత్ జట్టు లోయర్ ఆర్డర్ లో హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్  హనుమ విహారి చేరిక తో రోహిత్ స్థానానికి ఎసరు వచ్చింది . అయితే సుదీర్ఘ అనుభవం ఉన్న రోహిత్ ను వదులుకోవడానికి సిద్ధంగా లేని జట్టు మేనేజ్ మెంట్, అతడ్ని ఓపెనర్ గా ఆడించాలని నిర్ణయించింది .  తొలుత దక్షిణాఫ్రికా తో జరిగిన మూడు రోజుల మ్యాచ్ లో రోహిత్ డకౌట్ కావడం పై కొందరు  అతని ఆటతీరు టెస్టు క్రికెట్ కు సరిపోదని  పెదవి విరిస్తే ...  మరికొందరు రోహిత్ కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని సూచించారు .


 జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తో సహా పలువురు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు . వైజాగ్ లో జరిగిన తొలి టెస్టు ఓపెనర్ రోహిత్ తాను ఆడిన తొలి మ్యాచ్ లోనే రెండు ఇన్నింగ్స్ లలో రెండు సెంచరీలు నమోదు చేసిన తొలి భారతీయ క్రికెటర్ అరుదైన ఘనత సాధించాడు . గతం లో వన్డే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గా ఆడి,  ఆ తరువాత వన్డే టెస్టు ఓపెనర్ గా అవతారమెత్తిన వీరేంద్ర  సెహ్వాగ్  తరహాలోనే రోహిత్ కూడా తొలుత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గా జట్టు లో స్థానం దక్కించుకుని ఆ తరువాత వన్డే ఓపెనర్ గా రాణించాడు .


 వన్డేల్లో విజయవంతమైన ఓపెనర్ గా రాణిస్తోన్న రోహిత్ , ప్రస్తుతం టెస్టుల్లోనూ తనదైన ముద్ర వేసే ప్రయత్నాన్ని చేస్తున్నాడు . ఇక రోహిత్ సక్సెస్ పై మాజీ ఓపెనర్ సెహ్వాగ్  సామజిక మాద్యం ద్వారా స్పందిస్తూ రోహిత్ కు ఇది అధితమైన టెస్టు మ్యాచ్ , టెస్టు క్రికెట్ లో  ఓపెనర్ గా చేయాలన్న అతని కల నెరవేరింది . భవిష్యత్తు లో అతనికి అంత మంచే జరగాలని కోరుకుంటున్నానని చెప్పాడు .


మరింత సమాచారం తెలుసుకోండి: